గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. గత మూడేళ్ళుగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. కాంగ్రెస్ లో నాయకత్వ, విధానాల మార్పులపై అసంతృప్తుల గళం పెరుగుతుండడం, కొందరు కీలక నేతలు రాజీనామా బాట పట్టడంతో ఎట్టకేలకు పార్టీ అధ్యక్ష ఎన్నికలపై ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఇక అక్టోబర్ 19న ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు. ముందుగా కాంగ్రెస్ ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ సీడబ్ల్యూసీ ముందు ఉంచిన ఎన్నికల షెడ్యూల్‌ను సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. అలాగే పార్టీ అధ్యక్ష పదవీకి పార్టీ నాయకులు ఎవరైనా నామినేషన్లు సమర్పించవచ్చన్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల చివరిసారిగా 2001లో జరగగా, సోనియా గాంధీపై అపుడు జితేంద్ర ప్రసాద పోటీలో నిలిచారు.
మెడికల్ చెకప్ కోసం విదేశాల్లో ఉన్న పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె వెంట ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు సీడబ్ల్యూసీ సమావేశానికి వర్చువల్ గా హాజరయ్యారు. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, జైరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, పీ చిదంబరం, ఆనంద్ శర్మ, కాంగ్రెస్ ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్, దరల పెరుగుదలపై సెప్టెంబర్ 4న నిర్వహించే హల్లాబోల్ ర్యాలీ, సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్ర తదితర అంశాలపై కీలకంగా చర్చించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్:
- నోటిఫికేషన్ విడుదల : సెప్టెంబర్ 22
- నామినేషన్ల దాఖలుకు గడువు: సెప్టెంబరు 24 నుండి సెప్టెంబర్ 30 వరకు
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 1
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 8
- ఎన్నికల ఓటింగ్ (ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే): అక్టోబర్ 17
- ఓట్ల కౌంటింగ్, ఫలితాల వెల్లడి: అక్టోబర్ 19
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY