పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కుదించే యోచనలో కేంద్రం?

Indian Parliament monsoon session, Parliament, Parliament Monsoon Session, parliament monsoon session 2020, Parliament Monsoon Session May be Cut Short, parliament monsoon session today, parliament session, parliament session 2020, Parliament session live updates

ప్రస్తుతం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా ప్రభావం నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలను కుదించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా శని, ఆదివారాలతో కలుపుకుని సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు 18 రోజుల పాటుగా సమావేశాలను కొనసాగించాలని నిర్ణయించారు. సమావేశాలకు ముందు ఉభయ సభల ఎంపీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 17మంది ఎంపీలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సభలో అన్ని జాగ్రత్తలతో, కరోనా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. భౌతిక దూర నిబంధనలను అనుసరించి సభ్యులకు సీట్లు కేటాయించారు.

అయినప్పటికీ పలువురిపై కరోనా ప్రభావం పడుతుండడంతో ‌సమావేశాలు కుదింపుకు ఆలోచన చేస్తునట్టు సమాచారం. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కీలక బిల్లులకు ఆమోదం తర్వాత సమావేశాలు వాయిదా పడే అవకాశం ఉంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అత్యవసర బీఏసీ సమావేశం నిర్వహించి, పార్లమెంట్ సమావేశాల తగ్గింపుపై చర్చించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =