సాయుధ దళాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్న యువకులకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ జూన్ 19న (ఆదివారం) ఉదయం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. దీనిలో ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్య నాయకులు, కార్యవర్గ సభ్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ బేరర్లు మరియు కార్యకర్తలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సత్యాగ్రహ దీక్షలో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, సానుభూతిపరులు ఢిల్లీ రావాలని పార్టీ వర్గాలు పిలుపునిచ్చాయి. అగ్నిపధ్ స్కీం అమలును తక్షణమే నిలిపివేయాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు దేశంలోని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై స్పందించిన అగ్ర నేత రాహుల్ గాంధీ వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తరహాలోనే అగ్నిపథ్ పథకాన్ని కూడా ఉపసంహరించుకోవాలని ప్రధాన మంత్రికి సూచించారు. మరోవైపు దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో యువకులు ఈ పథకానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. హైదరాబాద్ సహా పలు నగరాల్లో హింసాత్మక సంఘటనలు కూడా చోటుచేసుకోవడం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ