ఇండోనేషియాలో భారీ భూకంపం – సునామీ హెచ్చరిక

7.3-Strong Earthquake Hits Indonesia, Indonesia, Indonesia issues tsunami warning, Indonesia issues tsunami warning after 7.5 magnitude, Indonesia issues tsunami warning after earthquake, Indonesia shivered by strong earthquake, Magnitude 7.6 earthquake hits Indonesia, Mango News, Mango News Telugu, Tsunami Alert, Tsunami warning issued as 7.5-magnitude earthquake, Tsunami Warning Issued Due To Magnitude 7.7 Earthquake, Tsunami Warning Issued Due To Magnitude 7.7 Earthquake Hits Indonesia

ఇండోనేషియాకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. ఇండోనేషియా లోని ఫోర్స్ సముద్ర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 7.7 గా నమోదయింది. దీంతో అప్రమత్తమైన ఇండోనేషియా ప్రభుత్వం తీరప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఇండోనేసియాలోని సముద్ర ప్రాంతంలో తరచుగా భూకంపాలు రావడం, సునామీ హెచ్చరికలు జారీ చేయటం సర్వసాధారణమైంది.

ఇంతకుముందు 2004వ సంవత్సరంలో డిసెంబర్ 26న 9.1 తీవ్రతతో ఇండోనేషియా లోని సుమత్రా దీవిలో అతి భారీ భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో సునామీ సంభవించి.. ఇండోనేషియా, థాయిలాండ్, భారత్, శ్రీలంక, మయన్మార్, మలేసియా, బాంగ్లాదేశ్, మాల్దీవ్స్, సోమాలియా, టాంజానియా, కెన్యా, ఒమన్.. ఇలా ప్రపంచంలోని సుమారు 20 దేశాలలో 2 లక్షల మందికి పైగా జలసమాధి అయ్యారు. కొన్ని దేశాలలోని తీరప్రాంతాలలో భారీ అలలు విరుచుకుపడి జల ప్రళయం సృష్టించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + eleven =