సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం వెనుక కీలక సూత్రధారి గుర్తింపు, అరెస్ట్

Telangana Secunderabad Railway Station Agnipath Agitation Suspect Arrested in Khammam, Telangana Secunderabad Railway Station Agnipath Agitation, Agnipath Agitation Suspect Arrested in Khammam, Secunderabad Railway Station Agnipath Agitation, Agnipath Agitation Suspect, Telangana Secunderabad Railway Station, Secunderabad Railway Station, Secunderabad Railway Station Protests Against Agnipath Recruitment Scheme, Protest Against Agnipath Army Recruitment Scheme, Agnipath Army Recruitment Scheme, violent protest at Secunderabad Railway Station, Secunderabad Railway Station, Agnipath Protests Live Updates, Agnipath Issue,Agnipath Protests, Agnipath protests in Telangana, Agnipath Scheme, Agnipath Scheme Updates, Agnipath, Agnipath Protests Highlights, #AgnipathScheme, #AgnipathRecruitmentScheme, #AgnipathSchemeProtest, #Agnipath, Agnipath Army Recruitment Scheme News, Agnipath Army Recruitment Scheme Latest News, Agnipath Army Recruitment Scheme Latest Updates, Agnipath Army Recruitment Scheme Live Updates, Mango News, Mango News Telugu,

శుక్రవారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అగ్నిపథ్’ నిరసనల సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై దాడి వెనుక చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది అనుకోకుండా జరిగింది కాదని, కొన్ని ప్రైవేటు అకాడమీల సహకారంతోనే నిరసనకారులు ఈ విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో బయటపడింది. ఆయా అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు ముందురోజు షెల్టర్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నరసారావుపేటలో ‘సాయి డిఫెన్స్‌ అకాడమీ’ని నడుపుతున్న సుబ్బారావు అనే వ్యక్తి దీనికి సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టడంలో ఇతనిదే కీలక పాత్రని, ఆయన ఆధ్వర్యంలోనే ఆందోళనకారులు పెద్ద ఎత్హున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు వచ్చినట్లు గుర్తించారు. అలాగే మొత్తం 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు పాల్గొన్నట్లు, వారందరికీ ఆయా ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు.. వాటర్ బాటిల్స్, బటర్ మిల్క్‌, పులిహోర ప్యాకెట్లు సరఫరా చేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. అయితే దీనికంతటికీ ప్రధాన సూత్రధారి, సాయి డిఫెన్స్ అకాడమీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సుబ్బారావును.. ఖమ్మంలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేశారు. మరోవైపు ఇప్పటివరకు ఈ అల్లర్లలో పాల్గొన్నవారిలో 30 మంది వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విధ్వంస ఘటనకు ముఖ్య కారకులుగా 12 మందిని గుర్తించారు పోలీసులు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =