కర్ణాటక రాష్ట్రంలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యలో పాత్ర ఉందన్న ఆరోపణలతో కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేఎస్ ఈశ్వరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన రాజీనామా లేఖను అందజేస్తానని మంత్రి కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పార్టీ జాతీయ నాయకులు, పార్టీలోని సీనియర్లు సహా తనను ఈ స్థాయికి ఎదిగేలా సహకరించిన వారిని ఇబ్బందికర పరిస్థితిల్లో ఉంచకూడదనే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఈ అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ, మంత్రి కేఎస్ ఈశ్వరప్ప స్వయంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని, పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. శుక్రవారం సాయంత్రం తన రాజీనామాను సమర్పించనున్నారని చెప్పారు. విచారణ తర్వాతే అన్నీ వాస్తవాలు బయటకు వస్తాయని, ప్రతిపక్షం అవసరంగా వివాదం చేసి విచారణ అధికారి లేదా న్యాయమూర్తిగా వ్యవహరించాల్సిన అవసరం లేదని విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ