నేటినుంచి తెలంగాణాలో వడ్లు కొనుగోళ్లు, క్వింటాల్‌కు రూ.1960 చొప్పున కొననున్న రాష్ట్ర ప్రభుత్వం

Telangana Paddy Purchase Starts From Today by State Government, Telangana Paddy Purchase Starts From Today, Paddy Purchase Starts From Today by State Government, Paddy Purchase Starts From Today, Paddy Purchase Starts From Today by Telangana State Government, Telangana State Government, Paddy Procurement Issue, Telangana Paddy Procurement Issue, Paddy Procurement in Telangana, Telangana Paddy Procurement, Paddy Procurement Centers, Paddy Procurement, Paddy Procurement News, Paddy Procurement Latest News, Paddy Procurement Latest Updates, Paddy Procurement Live Updates, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వడ్లు కొనుగోళ్లకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నిన్న సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇటీవల వరి సేకరణను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం రానున్న రెండు రోజుల్లో యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచేందుకు సిద్ధమైంది. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా యాసంగి 2019-20లో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి వరి పంటను వరుసగా మూడో సీజన్‌కు కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. క్వింటాల్ ధాన్యంకు రూ.1960 కనీస మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోంది. కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చూసేందుకు, అలాగే కోవిడ్-19 మార్గదర్శకాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం, అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 650 కేంద్రాలను నిర్వహిస్తుండగా రాబోయే కొద్ది రోజుల్లో వాటి సంఖ్య 6,575 కి పెంచనున్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిర్దిష్ట తేదీ మరియు సమయానికి పంటను తీసుకురావడానికి వారికి టోకెన్లు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల ప్రకారం 17 శాతం కంటే తక్కువ తేమ ఉన్న వరిని మాత్రమే కొనుగోలు చేస్తారు’’ అని టీఎస్‌సీఎస్‌సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ యేడాది యాసంగిలో మొత్తం 68.14 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం వరి దిగుబడి దాదాపు 1.38 కోట్ల టన్నులు ఉంటుందని అంచనా.

కాగా తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవసాయ సంవత్సరంలో 1.28 కోట్ల టన్నుల వరి సేకరణ లక్ష్యాన్ని సాధించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ (TSCSC) ద్వారా సుమారు 80 లక్షల టన్నులను సేకరించాలని యోచిస్తోంది. తెలంగాణలోని మిల్లర్లు దాదాపు 20 లక్షల టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉందని, విత్తన కంపెనీలు విత్తన ప్రాసెసింగ్ కోసం మరో 10 లక్షల టన్నులు కొనుగోలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. రైతులు పొట్టు లేకుండా వరిని తీసుకురావాలని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 20 వేల కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీని కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు త్వరగా చెల్లింపులు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు 20 కోట్ల గన్నీ బ్యాగుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + twenty =