దేశంలో కరోనా విజృంభణతో గత కొన్ని రోజులుగా 45 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 31,358 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 48,916 కరోనా పాజిటివ్ కేసులు, 757 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూలై 25, శనివారం ఉదయానికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,36,861 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా బాధితుల రికవరీ రేటు 63.54 శాతానికి పెరిగింది. అలాగే కరోనా మరణాల రేటు 2.35 శాతంగా ఉంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 25, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 13,36,861
- కొత్తగా నమోదైన కేసులు (జూలై 24 – జూలై 25 (8AM-8AM) : 48,916
- నమోదైన మరణాలు : 757
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 8,49,431
- యాక్టీవ్ కేసులు : 4,56,071
- మొత్తం మరణాల సంఖ్య : 31,358
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu