దేశంలో కరోనా నుంచి కోలుకున్న 52 లక్షలకు పైగా బాధితులు

Covid-19 in India: 86821 New Cases Reported, and Total Tally Crosses 63 Lakh Mark

భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 86,821 పాజిటివ్ కేసులు నమోదవగా, 1181 మంది మరణించారు. దీంతో అక్టోబర్ 1, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 63,12,584 కు, మరణాల సంఖ్య 98,678 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో 85,376 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 52,73,201 కు చేరుకుంది.

దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 83.5 శాతం గానూ, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, ఎక్కువగా కరోనా మరణాలు నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో మరియు హోమ్ ఐసొలేషన్ లలో 9,40,705 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu