పంటలకు కనీస గిట్టుబాటు ధరలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh government announce MSP for crops, AP announce MSP for Kharif crops on October 1, AP Govt Announces Minimum Prices for 24 Types of Crops, AP Minimum Prices for 24 Types of Crops, AP News, Minimum Prices for 24 Types of Crops, Minimum Prices for Crops, MSP for Kharif crops, MSP for Kharif crops in Ap, MSP for Khariff crops, MSP for Rabi Crops for marketing

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే రైతులు పండించిన ఏ పంటకు ఎంత కనీస గిట్టుబాటు ధర ఇస్తామనేది అక్టోబర్‌ 1వ తేదీన ప్రకటించబోతున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధరల్ని ప్రకటించింది. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరల వివరాల పోస్టర్‌ను సీఎం వైఎస్‌ జగన్ ఈ రోజు‌ క్యాంప్‌ ఆఫీసులో ఆవిష్కరించారు. మొత్తం 24 పంటలకు మద్దతు ధరలను వెల్లడించారు. మరోవైపు ప్రకటించిన కనీస గిట్టుబాటు ధరలతో కూడిన పోస్టర్‌ను అక్టోబర్‌ 5వ తేదీ కల్లా రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకేలు) వద్ద ప్రదర్శించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వం పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు:

  1. పసుపు – రూ.6,850 (క్వింటాల్‌కు)
  2. మిర్చి – రూ.7,000
  3. ఉల్లి – రూ.770
  4. చిరు ధాన్యాలు (కొర్రలు, అండు కొర్రలు, అరికెలు, వరిగలు, ఊదలు, సామలు) – రూ. 2500
  5. ధాన్యం (కామన్) – రూ.1868
  6. ధాన్యం (గ్రేడ్ -ఏ) – రూ.1888
  7. జొన్న హైబ్రిడ్ : మనుషులు తినే రకం – రూ. 2620, పశువుల దాణా రకం – రూ. 1850
  8. జొన్నలు (మాల్ దండి) – రూ. 2640
  9. రాగులు – రూ.3,295
  10. మొక్కజొన్నలు – రూ. 1850
  11. సజ్జలు – రూ. 2150
  12. పెసలు – రూ.7196,
  13. కందులు – రూ.6000
  14. మినుములు – రూ.6000
  15. వేరుశనగ – రూ.5275
  16. కొబ్బరి (మర) – రూ.9960
  17. కొబ్బరి (బాల్) – రూ.10300
  18. కాటన్ (పొట్టి పింజ) – రూ.5515
  19. కాటన్ (పొడువు పింజ) – రూ.5825
  20. బత్తాయి/మౌసంబి – రూ.1400
  21. అరటి – రూ.800
  22. శనగలు – రూ.5100
  23. సోయాబీన్ – రూ.3880
  24. పొద్దుతిరుగుడు – రూ.5885

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + twelve =