కరోనా వైరస్ ప్రభావంతో ఇటీవల పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువుగా ఉంది. దీంతో మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో అక్టోబర్ 5, సోమవారం నాడు కూడా రికార్డ్ స్థాయిలో 10244 కరోనా కేసులు, 263 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,53,653 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 38,347 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 12,982 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 11,62,585 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,52,277 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు అక్టోబర్ 5 నాటికీ మహారాష్ట్రలో 71,69,887 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu