అమృత్‌సర్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం

125 passengers from an Italy-Amritsar chartered flight test positive, 125 Passengers of Chartered Flight, 125 Passengers of Chartered Flight From Italy Tested Positive For Covid-19 in Amritsar, Amritsar Latest Corona Live Updates, Amritsar Latest Corona Updates, Amritsar News, charter flight from Italy test positive For Covid-19, Coronavirus, coronavirus india, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Covid-19 Positive Cases, Covid-19 Positive Cases Live Updates, Omicron, Omicron covid variant, Omicron variant, Omicron Variant Cases in Inida, Punjab, Punjab Covid cases

ఒమిక్రాన్ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ విమానంలో వంద మందికి పైగా ప్రయాణికులకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అవడం కలకలం రేపుతోంది. ఇటలీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అంతర్జాతీయ ఛార్టెడ్ విమానంలో ప్రయాణించిన 125 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని గురువారం నిర్థరణ అయింది. అమృత్‌సర్ విమానాశ్రయానికి వచ్చిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ ఎయిరిండియా విమానంలో మొత్తం 179 మంది ప్రయాణించారు. ఈ వివరాలను ఈ విమానాశ్రయం డైరెక్టర్ వీకే సేఠ్ తెలిపారు.

దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయంలోనే కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది. ఇందులో భాగంగానే, ఇటలీ నుంచి ఓ ఛార్టెడ్ విమానం అమృత్‌సర్ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే.. అందులోని ప్రయాణికులనందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో మొత్తం 125 మంది ప్రయాణికులకు వైరస్ సాకినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ బాధితులను క్వారంటైన్ కు తరలించేందుకు ఎయిర్ పోర్ట్ ఎదుట అంబులెన్సులు పెద్ద సంఖ్యలో నిలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − three =