దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే మరో 55,079 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 876 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఆగస్టు 18, మంగళవారం నాటికి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 27,02,743 కు చేరింది. కరోనా మరణాల సంఖ్య 51,797 కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో రికార్డ్ స్థాయిలో 57,937 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయినా వారి మొత్తం సంఖ్య 19,77,779 కు చేరుకుంది. ప్రస్తుతం 6,73,166 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 73.18% శాతంగా నమోదవగా, మరణాల రేటు 1.92 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu