ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “స్వల్పంగా జ్వరం ఉండడంతో, ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకున్నాను. పరీక్షలో రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. దీంతో సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నాను. ప్రస్తుతం జ్వరం లేదా మరే ఇతర సమస్య లేదు, నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మీ ఆశీస్సులతో త్వరలోనే తిరిగి విధుల్లో చేరతాను” అని మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. మరోవైపు ఢిల్లీలో కరోనా ప్రభావం తగ్గినట్లే కనిపించినా, కొన్ని రోజులుగా కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్నాయి. సెప్టెంబర్ 14 నాటికీ ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,21,533 కు చేరుకుంది.
हल्का बुख़ार होने के बाद आज कोरोना टेस्ट क़राया था जिसकी रिपोर्ट पोज़िटिव आई है. मैंने स्वयं को एकांतवास में रख लिया है.
फ़िलहाल बुख़ार या अन्य कोई परेशानी नहीं है मैं पूरी तरह ठीक हूँ. आप सब की दुआओं से जल्द ही पूर्ण स्वस्थ होकर काम पर लौटूँगा.— Manish Sisodia (@msisodia) September 14, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu