సింగరేణిలో కారుణ్య నియామకాల అంశంపై సీఎం కేసీఆర్ వివరణ

CM KCR, Compassionate Appointment In Singareni Collieries, compassionate employment to Singareni, compassionate jobs to Singareni, KCR About Compassionate Appointment In Singareni, KCR promises compassionate jobs to Singareni, Singareni, Singareni Collieries, Singareni Collieries Limited, Singareni compassionate appointments, Singareni Jobs

తెలంగాణ అసెంబ్లీ ఆరో రోజు సమావేశాల్లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సింగ‌రేణి స‌మ‌స్య‌ల‌పై స‌భ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వివరణ ఇచ్చారు. సింగరేణిలో కారుణ్య నియామకాలపై స్పందిస్తూ, అర్హులైన వారుంటే కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల్లోకి తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. కారుణ్య నియామకాల్లో వారి చ‌దువుకు స‌మాన స్థాయి ఉద్యోగాలు ఖాళీ అయిన‌ప్పుడు నియ‌మిస్తామని, అయితే పోస్టులు సృష్టించి ఇవ్వలేమని తెలిపారు. ముందుగా జ‌న‌ర‌ల్ మ‌జ్దూర్ గా తీసుకుని, కొన్ని రోజులు శిక్ష‌ణ అనంతరం అప్‌గ్రేడ్ చేసి ఉద్యోగంలోకి తీసుకుంటామని చెప్పారు. కారుణ్య నియామ‌కాలు వీలైనంత తొందరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. సింగరేణి సిబ్బందికి ఇన్‌కం ట్యాక్స్ ర‌ద్దు చేయాలని ప్రధాని మోదీని అనేక సార్లు కోరామని చెప్పారు. కేంద్రం పట్టించుకోకపోవడంతో ఈ అంశంపై పార్లమెంట్‌లో పోరాడతామని అన్నారు. సింగరేణిలో ఉద్యోగికి పదవీవిరమణ చేసిన రోజునే అన్ని ఇచ్చి పంపేలా ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 12 =