24 గంటల్లో 5475 కరోనా కేసులు, 91 మరణాలు నమోదు

Delhi Reports 5475 New Covid-19 cases and 91 Deaths in Last 24 Hours

ఢిల్లీలో గత కొన్ని రోజులుగా మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా నివారణకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్చలు తీసుకుంటుంది. పలు ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లను పెద్దఎత్తున అందుబాటులోకి తెస్తుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలను పాటించని వారికీ రూ.2000 జరిమానా విధించేలా ఆదేశాలు ఇచ్చారు. ఇక గురువారం నాడు ఢిల్లీలో కొత్తగా 5475 కరోనా కేసులు, 91 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,51,262 కు, మరణాల సంఖ్య 8,811 కి చేరింది. ఇక కొత్తగా కరోనా నుంచి కోలుకున్న 4,937 మందితో కలిపి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 5,03,717 కి చేరింది. ప్రస్తుతం 38,734 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు నవంబర్ 26 నాటికీ ఢిల్లీలో 60,39,703 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ