ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మూడోదశ కరోనా వ్యాప్తితో గత కొద్దీరోజులుగా ఢిల్లీలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నవంబర్ 21, శనివారం నాడు కూడా 5879 కరోనా కేసులు, 111 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,23,117 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,270 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 6,963 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 4,75,106 కు చేరుకుంది. ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 90.08 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 39,741 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు శనివారం నాటికీ ఢిల్లీ నగరంలో 57,61,078 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ