చంద్రుడిపై స్థలాన్ని అందరం కొనొచ్చా? మరి యాజమాన్య హక్కులు ఎప్పుడొస్తాయ్..?

Lake of Dream, Bay of Rainbow, Sea of Vapors,buy a place on the moon,space on the moon

తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి ఉద్యోగి అయిన సుద్దాల రాంచందర్‌ కూతురు.. అమెరికాలో స్థిరపడిన సుద్దాల సాయి విజ్ఞత.. తన తల్లికి చంద్రుడి మీద స్థలం కొని బహుమతిగా ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. చంద్రుడిపై భూమి కొనొచ్చని తెలుసుకున్న సాయి విజ్ఞత.. తన వకుళాదేవికి గిఫ్టుగా చంద్రుడిపై స్థలాన్ని కొని లూనార్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇలా చంద్రుడిపై భూమిని కొన్నవాళ్లు ఇప్పటికే చాలామంది ఉన్నారు. అయితే చంద్రుడిపై ఎవరైనా స్థలాన్ని కొంటే అది వారి సొంతం అవుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి చంద్రుడిపై స్థలాన్ని కొన్నా కూడా తమ సొంతమని చెప్పుకునే హక్కు ఎవరికీ ఉండదట.

చంద్రుడిపై స్థలాన్ని ఎవరైనా కొన్నా కూడా.. దాని మీద యాజమాన్య హక్కులను మాత్రం పొందలేరట. కేవలం స్థలం కొన్నవారిపై అక్కడి స్థలం రిజిస్టరై మాత్రమే ఉంటుంది. అంతేగానీ, దానిని ఎవరూ క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉండదట. 1967లో 104 దేశాలు దీనికి సంబంధించిన విషయంపై ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయట. అంటే చంద్రుడు, నక్షత్రాల వంటి వాటిపై ఏ ఒక్క దేశానికి కూడా యాజమాన్య హక్కులు ఉండబోవని ఒక ఒప్పందం చేసుకున్నాయట. ఈ అగ్రిమెంట్‌పై అప్పుడు భారత్ కూడా సంతకం చేసింది. 1967లో సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ తో పాటు యునైటెడ్ కింగ్‌డమ్ కొలోనియల్ కాంపిటీషన్‌ను అడ్డుకోవడానికి ఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే అంతర్జాతీయ ఒప్పందాన్ని తీసుకువచ్చాయి. దీని ప్రకారం భూమి కాకుండా ఇతర గ్రహాలు, నక్షత్రాలు వంటి ఏ ప్రాంతంపైనైనా ఒక వ్యక్తికి గాని, ఒక దేశానికి గాని యాజమాన్య హక్కులు ఉండబోవని అర్ధం.

ఒకవేళ చంద్రుడిపై స్ధలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నవారికి ఒక వెబ్‌సైట్ ఉంది. ఆసక్తి ఉన్న వారెవరయినా https://lunarregistry.com వెబ్‌సైట్‌లో చంద్రుడిపై స్థలాన్ని కొనడానికి ముందుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చంద్రుడిపై కూడా ఒక్కో ప్రాంతానికి ఒక్కో పేరు ఉంటుంది. లేక్ ఆఫ్ డ్రీమ్, బే ఆఫ్ రెయిన్‌బో, సీ ఆఫ్ వేపర్స్ వంటి ప్రాంతాల పేరుతో ఉన్నాయి. చంద్రుడిపై స్థలాన్ని కొనాలనుకున్నవారు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కొనడానికి అవకాశం ఉంది. https://lunarregistry.com వెబ్‌సైట్ నుంచి స్ధలాన్ని కొన్నాక మీ పేరు మీద పూర్తి డాక్యుమెంట్లు వస్తాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE