ఫ్రాన్స్‌ రూ. 17 వందల కోట్ల మద్యం ధ్వంసం..!!

sensational decision, French government, Rs. 17 hundred crores of liquor, destruction , Crafted beer,Wine

ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అవసరానికి మించి ఉన్న మద్యంను ధ్వంసం చేయనుంది. క్రాఫ్టెడ్ బీర్‌కు దేశవ్యాప్తంగా పెరిగిన డిమాండ్‌తో మద్యం తయారీదారులు అవస్థలు పడుతున్నారు. బోర్డాక్స్, లాంగ్యూడాక్ కంపెనీలు.. తయారు చేసిన మద్యం నిల్వలు భారీగా పెరిగిపోయాయి. అదే సమయంలో వైన్‌కు డిమాండ్ తగ్గిపోవడంతో ధరలు పడిపోయాయి.

బోర్డాక్స్, లాంగ్యూడాక్ కంపెనీల నుంచి 17 వందల కోట్లు పెట్టి ప్రభుత్వం వైన్ కొనుగోలు చేయనుంది. దేశంలో అదనంగా ఉన్న వైన్‌ను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. వైన్‌కు మంచి ధర తీసుకొచ్చేందుకే.. మద్యంను ధ్వంసం చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. వైన్‌ను ధ్వంసం చేసిన తర్వాత… అందులోని ఆల్కాహాల్‌ను వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేయడానికి కంపెనీలకు విక్రయించనుంది. వైన్‌ తయారీదారులు ఇతర మార్గాల్లో ఉపాధి వెతుక్కోడానికి ఈ నిధులను కేటాయించనుంది.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఆహారం, ఇంధన ధరలు పెరగడంతో.. ప్రజలు ఖర్చులను తగ్గించుకుంటున్నారు. మద్యం కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదు. 2023 జూన్ వరకు ఐరోపా కమిషన్‌ గణాంకాల ప్రకారం… ఇటలీలో 7, స్పెయిన్‌లో 10, ఫ్రాన్స్‌లో 15, జర్మనీలో 22, పోర్చుగల్‌లో 34 శాతం వైన్‌ వినియోగం తగ్గిపోయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 2 =