ప్రపంచ దేశాలలో పర్యాటకానికి, ఉద్యోగ అవకాశాలకు ప్రసిద్ధి పొందిన దుబాయ్ ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) లోని ప్రధాన నగరం అయిన దుబాయ్ ప్రపంచంలోనే మొట్టమొదటి 100 శాతం పేపర్ లెస్ గవర్నమెంట్‌గా చరిత్ర సృష్టించింది. అక్కడి ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల అంతర్గత, బాహ్య సేవలను, ట్రాన్సాక్షన్స్‌ను వంద శాతం డిజిటల్ ఫార్మాట్ లోనే కొనసాగిస్తూ ఈ ఘనత సాధించింది. దీనికి సంబంధించి ఎమిరేట్స్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దుబాయ్ చరిత్రలో ఆవిష్కరణ, సృజనాత్మకత అనే కొత్త శకం ప్రారంభమైందని షేక్ హమ్దాన్ ఆ ప్రకటనలో తెలిపారు.
ప్రపంచంలోని సంపన్న నగరాల్లో ఒకటిగా ఉన్న దుబాయ్‌లో జనాభా 35 లక్షలు. దుబాయ్‌లో పేపర్‌లెస్ స్ట్రాటజీని ఐదు వరుస దశల్లో అమలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పేపర్‌లెస్ గవర్నెన్స్ ద్వారా.. 14 మిలియన్ గంటల మనిషి శ్రమను, 1.3 బిలియన్ దిర్హామ్స్ (350 మిలియన్ డాలర్లు) ఆదా చేసినట్లు షేక్ హమ్దాన్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ ఘనత సాధించడం ద్వారా ప్రపంచానికే డిజిటల్ రాజధానిగా దుబాయ్ నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, ఇంతకుముందు అమెరికా, యూకే, యూరప్ కూడా డిజిటల్ వ్యవస్థ మార్పు కోసం కృషి చేశాయి కానీ, సైబర్ దాడుల భయంతో ముందడుగు పడలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ