ముంబయిలో అమాంతంగా పెరిగిన హోటళ్ల ధరలు

Due To Anant Ambani Radhika'S Wedding Star Hotels Prices Increase In Mumbai,Due To Anant Ambani Radhika'S Wedding,Star Hotels Prices Increase In Mumbai,Anant Ambani Radhika'S Wedding Star Hotels Prices Increase In Mumbai,Ambani Radhika'S Wedding, Hotels Prices Increase In Mumbai,Hotels Prices,Anant Ambani Radhika'S Wedding, Due to Anant Ambani,Ambani's Wedding,Mumbai,Star Hotels,Anant Ambani Radhika Merchant Wedding,prices show unbelievable jump,Politics,Political News, Mango News, Mango News Telugu
due to Anant Ambani, Radhika's wedding .. Star hotels prices increase in Mumbai

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి పేరుతో.. ముంబైలో స్టార్ హోటళ్లకు కాసుల పంట పండించుకోవడానికి రెడీ అయిపోయారు.ఇప్పుడు ఎక్కడ చూసినా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సంబరాల గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ,రాధికా మర్చంట్‌ జూలై 12న మూడు ముళ్లతో ఒక్కటి కాబోతుండటంతో..ఈ పెళ్లి కోసం ముంబై వేదిక కాబోతుంది.

వీరిద్దరి వివాహానికి  దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, వీవీఐపీలు కూడా  ముంబైలో వాలిపోడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా వచ్చే అతిథుల కోసం ఇప్పటికే స్టార్ హోటళ్లన్నీ ప్రీ బుకింగ్ అయిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎవరైనా బుక్ చేసుకుందామని చూస్తూ  ధరలు అమాంతంగా పెరిగిపోయి ఆకాశాన్నంటుతున్నాయి. స్టార్ హోటల్‌లో ఒక్క రాత్రి బసకు దాదాపు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సులో ఉన్న ట్రైడెంట్‌, ఒబెరాయ్‌ హోటళ్ల వెబ్‌సైట్లలో కనిపించినదాని ప్రకారం.. జులై 10 నుంచి జులై 14 వరకు గదులు ఖాళీగా లేవు.దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న స్టార్ హోటల్స్‌లో  రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక్క రాత్రి బస చేయడానికి మొన్నటివరకూ రూ.13 వేల నుంచి రూ.30 వేలు ఉండగా.. జులై 14న రూ.40 వేలు నుంచి 50 వేలుగా కనిపిస్తోంది. మరో హోటల్‌లో ఏకంగా జులై 12న  రూ.90వేలకు పైగా ఉండగా..అన్ని ట్యాక్సులతో  కలిపి ఇది మరింత పెరుగుతుంది. జులై 10, 11 తేదీల్లో ఏ స్టార్ హోటల్‌లోనూ రూమ్స్ ఖాళీగా లేవు.

జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జులై 12న అనంత్‌ అంబానీ  వివాహం జరగనుండగా.. జులై 14 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జులై 13న ‘శుభ్‌ ఆశీర్వాద్‌’ కార్యక్రమం ఉండగా..14న మంగళ్‌ ఉత్సవ్‌ లేదా రిసెప్షన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అనంత్ ,రాధిక వివాహానికి వచ్చే అతిథులు ఎక్కడ బస చేస్తారనే విషయంపై ఇంకా అంబానీ కుటుంబం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

మరోవైపు అనంత్ , రాధిక పెళ్లికి  విఐపీలు, వివిఐపీలు రానుండటంతో.. జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వైపు వెళ్లే మార్గాల్లో  ముంబై ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. జులై 12 నుంచి 15 వరకు జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వైపు వెళ్లే మార్గాల్లో  ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ముంబై వాసులు ఇది గమనించి దానికి అనుగుణంగా తమ ప్రయాణించే మార్గాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE