నివేదికను షేర్ చేసిన ఆర్ధిక సర్వే..

Economic Survey Shared The Report, Economic Survey, Economic Survey Report, Savings,The Savings, Economic Survey Report, Investments In Gold, Real Estate Sectors,Banks, Stock Market, Mutual Funds, Economic Report, Latest Economic Report Updates, Mango News, Mango News Telugu
Savings,The savings, Economic Survey report, Investments in gold, real estate sectors,Banks, stock Market, Mutual Funds

ధనం మూలం ఇదమ్ జగత్,  ధనమేరా అన్నిటికి మూలం, పైసామే పరమాత్మ..ఇలా రకరకాల మాటలు డబ్బులు గురించి వింటూ ఉంటాం. నిజమే మనిషిని విలువ ఇచ్చే స్టేజ్ నుంచి మనీ ఉంటేనే ఆ మనిషికి విలువనిచ్చే రోజులకు వచ్చేశాం. అందుకే డబ్బులను ఎంతగా పొదుపు చేసుకుంటే అంత మంచిదనే భావనలో ఉన్నారు చాలామంది. అయితే దీనికి విరుద్ధంగా ఉన్న చిన్న జీవితంలో ఉన్నప్పుడే ఎంజాయ్ చేద్దాం అనుకున్నవాళ్లూ కూడా ఉన్నారు.

ఏది ఏమయినా ఆర్ధిక అవసరాల కోసం ఎవరి మీద ఇబ్బంది పడకుండా తమ జాగ్రత్తలో తాముండాలనుకునే వాళ్లే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇలా  చాలామంది కాలం గడుస్తున్న కొద్దీ ఆర్ధిక స్థిరత్వాన్ని పెంచుకోవడం, జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం కోసం సేవింగ్స్ బాటలోకే వెళుతున్నారు. భవిష్యత్ అవసరాల కోసం సంపాదించిన సొమ్ములో ఎంతోకొంత దాచుకుంటున్నవాళ్లు పెరిగారు. కొందరు బంగారం, స్థిరాస్తి రంగాల్లో పెట్టుబడులు పెడుతూ తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు.  తాజాగా మనీ 9 అనే ఓ సంస్థ .. ప్రజల సేవింగ్స్ పై చేసిన సర్వేలో కొన్ని కీలక విషయాలు బయటకొచ్చాయి.

దేశంలో నూటికి 91 శాతం మంది తాము కష్టపడి సంపాదించిన డబ్బులలో కొంతైనా పొదుపు చేయాలనే అనుకుంటున్నారు. దీని వల్ల భవిష్యత్‌ కి భరోసా కూడా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇలాంటి సేవింగ్స్‌ కోసం చాలామంది రెండింటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నట్లు ఈ  సర్వే చెబుతోంది. ఈ సేవింగ్స్ లో ఒకటి బ్యాంకులో ఎఫ్‌డీలు, సేవింగ్ అకౌంట్స్ వంటివి  అయితే , రెండోది బంగారం కొనుగోలు అని తేల్చింది. అయితే ఇందులో అత్యధిక వాటా బ్యాంకులదేనట. తమ తమ సేవింగ్స్‌ కోసం.. సుమారు 70 శాతం మంది   బ్యాంకులనే నమ్ముకుంటున్నారని ఆ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాతి స్థానంలో బంగారం కొనుగోలు నిలిచిందని పేర్కొంది. 21 శాతం మంది వరకూ బంగారం రూపంలో డబ్బును పొదుపు చేస్తున్నారట.

ప్రస్తుతం మార్కెట్ లో చాలా స్కీములు, రకరకాల ఇన్వెస్ట్మెంట్ మార్గాలు అందుబాటులో ఉంటున్నా కూడా.. చాలా మంది బ్యాంకులు, బంగారంపైనే పెడుతున్నట్లు సర్వే వెల్లడించింది. మరోవైపు కొంతకాలంగా స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులపైన కూడా జనాల్లో ఆసక్తి పెరుగుతోందని ఈ సర్వే తెలిపింది. గతంలో స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ల సంఖ్య 3 శాతం మాత్రమే ఉండగా.. ఈ ఏడాది అది 9 శాతానికి పెరగడమే దానికి నిదర్శమని అంటోంది. స్టాక్ మార్కెట్‌తో పాటు మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ ఇప్పుడిప్పుడు కొంతమంది ఇన్వెస్ట్ చేయడానికి  ఆసక్తి చూపిస్తున్నారట. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్యం గతంలో 6 శాతం ఉంటే ఇప్పుడు అది 10 శాతానికి పెరిగినట్లు తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ