ఏ పనికిమాలినన యెదవ ఆ పని చేయడు.. ఆర్జీవీకి నాగబాబు కౌంటర్

Nagababu Is Counter to RGV, Nagababu Counter To RGV, Nagababu Counter, Counter to RGV, RGV, Ram Gopal Varma, Naga babu, Social Media Warm Vyuham Movie, Latest Nagababu Counter to RGV, Latest Vyuham News, RGV Vs Nagababu, CM Jagan, Chandrababu Naidu, AP CM, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
RGV, Ram Gopal Varma, Naga babu, Social Media Warm vyuham Movie

రాంగోపాల్ వర్మ.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. ఆయన ఏం చేసినా సంచలనమే. ఏ పని చేసినా కాంట్రవర్సీనే. నిత్యం ఆర్జీవీకి సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఆర్జీవీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయోపిక్‌ను ‘వ్యూహం’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈనెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆర్జీవీ ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు వ్యూహం సినిమాపై స్పందిస్తూ సంచలన కామెంట్లు చేశారు. ఓ టీవీ డిబెట్‌లో.. వ్యూహం ఓ చెత్తి సినిమా అన్న కొలికపూడి.. వర్మ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఈ అంశం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

ఇప్పటికే ఈ వివాదంపై పలువురు భిన్నరకాలుగా స్పందించారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై పోలీసులను ఆశ్రయించారు. డబ్బులకు ఆశపడి తనపై ఎవరైనా దాడి చేస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. అయితే ఇదే అంశంపై సినీనటుడు, జనసేన నేత నాగబాబు స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మను కమెడియన్‌తో పోల్చారు. రామ్ గోపాల్ వర్మపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అని.. తాను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నాగబాబు చెప్పుకొచ్చారు.

అలాగే ‘‘ఆర్జీవీ గారూ మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ డోఖా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఏపీలో, ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన యెదవా మీకు హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చిన కమెడియన్‌ను ఎవడు చంపడు కదా.. మీరేం వర్రీ అవకండి.. నిశ్చితంగా, నిర్భయంగా ఓ వోడ్కా పెగ్గేసి పడుకోండి’’ అంటూ నాగుబాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.

అటు నాగబాబు స్పందనకు అంతే గట్టిగా రామ్ గోపాల్ వర్మ కౌంటర్‌ ఇచ్చారు. వెటకారంగా రిప్లై ఇచ్చారు. ‘సార్ నా కన్న పెద్ద కమెడియన్ ఎవడంటే.. నా సినిమాలో మీరు.. మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కొని టీ తాగి పడుకోండి’ అంటూ  సెటైరికల్‌గా ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం నాగబాబు, రామ్ గోపాల్ వర్మ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టలు వైరల్‌గా మారాయి. ఈ రెండు పోస్టులకు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − four =