దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలవనుంది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం తరువాత దీనికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించడం తెలిసిందే. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది. కరోనా నేపథ్యంలో.. అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. దేశంలో ఎన్నికలు వాయిదా వేయాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. దీంతో, గతవారం కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని ప్రధాన పార్టీలతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల నిర్వహణకే సుముఖత వ్యక్తం చేశాయి. ఈమేరకు, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే.. ఈరోజు ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ