దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మంగళవారం రాత్రి కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో మోహన్ లాల్ మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వానికి, కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థలకు, కరోనా వ్యాక్సినేషన్ లో పాల్గొంటున్న ఆసుపత్రులకు, వైద్య సిబ్బందికి మోహన్ లాల్ ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 53వ రోజైన మార్చి 9, మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 13.5 లక్షలకుపైగా (13,59,173) కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అలాగే బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2.43 కోట్లు (2,43,67,906) దాటినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ