డీఆర్‌డీవో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి.కామత్‌

Famous Scientist Samir V Kamat Assumed the Charge as Chairman of Defence Research and Development Organisation

ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి.కామత్‌ ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) చైర్మన్‌గా మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఆర్‌డీవో చైర్మన్‌గా సమీర్ వి.కామత్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీఆర్‌డీవోలో నావల్‌ సిస్టమ్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న కామత్‌, ప్రస్తుత డీఆర్‌డీఓ ఛైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి నుంచి బాధ్యతలను అందుకున్నారు.

సమీర్ వి.కామత్‌ కు 60 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గత 30 సంవత్సరాలుగా కామత్‌ రక్షణ రంగానికి విశేషమైన సేవలు అందిస్తున్నారు. మరోవైపు జి.సతీష్‌రెడ్డిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు సైంటిఫిక్ అడ్వైజర్‌గా నియమించారు. సతీష్‌రెడ్డి ఆగస్టు 25, 2018 నుంచి ఆగస్టు 25, 2022 వరకు నాలుగేళ్ళ పాటుగా డీఆర్‌డీఓ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY