మహారాష్ట్రలో తక్షణమే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలి.. డిమాండ్ చేసిన మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే

Maharashtra Former CM Uddhav Thackeray Demands For Mid-Term Elections Immediately, Former CM Uddhav Thackeray Demands For Mid-Term Elections Immediately, Uddhav Thackeray Demands For Mid-Term Elections Immediately, Maharashtra Former CM Demands For Mid-Term Elections Immediately, Mid-Term Elections Immediately, Mid-Term Elections In Maharashtra Immediately, Maharashtra, Mid-Term Elections, Maharashtra Former CM Uddhav Thackeray, Maharashtra EX-CM Uddhav Thackeray, Former CM Uddhav Thackeray, CM Uddhav Thackeray, Uddhav Thackeray, Mid-Term Elections In Maharashtra News, Mid-Term Elections In Maharashtra Latest News, Mid-Term Elections In Maharashtra Latest Updates, Mid-Term Elections In Maharashtra Live Updates, Mango News, Mango News Telugu,

మహారాష్ట్రలో అనూహ్య పరిణామాల మధ్య శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. బీజేపీ మద్దతుతో షిండే కొత్త సర్కార్‌ను ఏర్పాటు చేశారు. అయితే అప్పటినుంచి ఇంకో కొత్త సమస్య ఎదురైంది. శివసేన పార్టీపై ఆధిపత్యం కోసం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, కొత్త సీఎం షిండే వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్ధవ్ ఈరోజు తొలిసారిగా బహిరంగ ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో తక్షణమే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తద్వారా తిరుగుబాటు నేతలకు ఇకపై శివసేన ఎన్నికల గుర్తును ఉపయోగించనివ్వబోమని హెచ్చరించారు. ఈరోజే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని నేను వారికి సవాల్‌ చేస్తున్నాను.. అప్పుడు మేం చేసింది తప్పు అయితే ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఒకవేళ మీరు తప్పు చేస్తే మిమ్మల్ని సాగనంపుతారు. ఎందుకంటే మీరు చేయాల్సింది ఇదే అయితే, రెండున్నరేళ్ల క్రితమే చేసి ఉండాల్సింది. అప్పుడు ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉండేది కాదని ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ఉద్ధవ్ ఠాక్రే ఇలా అన్నారు. అలాగే మాతోశ్రీకి పిలిస్తే వచ్చేస్తాం అంటున్నారు కొందరు, మరికొందరేమో నాపై వారికి గౌరవం ఉందని చెప్పారు. వీటన్నింటికీ నేను కృతజ్ఞుడను. కానీ మీరు వచ్చి నాతో మాట్లాడి ఉంటే, ఇలా మనం వేరుపడి ఉండేవాళ్ళం కాదుకదా అని నేను వారికి గుర్తుచేయదలుచుకున్నాను. కానీ ఇప్పుడు మీరు మా పార్టీ ప్రతిష్టపై దాడులు చేశారు. కాబట్టి మీ ప్రేమ, గౌరవం నిజమో కాదో మీరే నిర్ణయించుకోండి, అని తిరుగుబాటు నేతలను ఉద్దేశించి అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − one =