భారతదేశ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యం వద్దు, పలు రంగాల ప్రముఖుల ట్వీట్స్

#IndiaTogether Tag, bollywood, Central Ministers, Climate Change Activist Greta Thunberg, Farm Laws, Farmers Against Agri Laws, Farmers Protest, Farmers Protest Against Farm Bills, Farmers Protest Against Farm Laws, Farmers Protest News, Farmers Protest Updates, Farmers Protesting Against Farm Laws, Greta Thunberg, International Celebrities, International Celebrities Extend Support To Farmers, Mango News, protesting farmers in India, Sports Celebrities

ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమంతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు జనవరి 26 న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ తర్వాత ఈ ఉద్యమం పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. కాగా రైతుల చేస్తున్న ఉద్యమానికి మద్ధతుగా మంగళవారం నాడు ప్రముఖ పాప్‌ సింగర్‌ రిహానా, ప్రముఖ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థనబర్గ్ ట్వీట్స్ చేయడంతో సోషల్ మీడియాలో ‌మరోసారి చర్చ మొదలైంది. రైతుల ఉద్యమం చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని సీఎన్‌ఎన్‌ ప్రచురించిన కథనాన్ని ట్యాగ్ చేస్తూ మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు అని అంటూ సింగర్ రిహానా ట్వీట్ చేసింది. అలాగే భారతదేశంలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నామని, సీఎన్‌ఎన్‌ కథనాన్ని జతచేస్తూ గ్రేటా థనబర్గ్ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమంపై అంతర్జాతీయ స్థాయిలో విదేశీ ప్రముఖులు స్పందించడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

ఇలాంటి విషయాలపై వ్యాఖ్యానించడానికి ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరుతున్నామని, ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యలు ఖచ్చితమైనవికావని, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని భారత విదేశాంగశాఖ బుధవారం నాడు ప్రకటన విడుదల చేసింది. కొన్ని స్వార్థ ప్రయోజన సమూహాలు భారతదేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును సమీకరించటానికి ప్రయత్నించాయని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాల గురించి, వాటి వల్ల వచ్చే లాభాలు గురించి వివరించారు. ఈ చట్టాలను కొందరు రైతులు సమస్యగా భావిస్తున్నారని, నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం తమ ప్రతినిధులైన కేంద్ర మంత్రులతో ఇప్పటికే పదకొండు రౌండ్ల చర్చలు జరిపారని పేర్కొన్నారు. ఈ చట్టాలను కొంతకాలం పాటుగా నిలుపుదల చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చిందని అన్నారు. జనవరి 26 న జరిగిన ఘటన దేశాన్ని బాధించిందని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం మరియు సంబంధిత రైతు సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. సమస్యలపై సరైన అవగాహన లేకుండా ప్రముఖులు వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనకు #IndiaTogether, #IndiaAgainstPropaganda అనే హ్యాష్ ట్యాగ్‌లను కూడా జోడించారు.

అనంతరం రైతులు చేస్తున్న ఆందోళనపై అంతర్జాతీయ ప్రముఖులు జోక్యం చేసుకోవడంపై దేశంలో ప్రముఖ వ్యక్తులు స్పందించారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం వద్దని, వేరే వాళ్ళ వ్యాఖ్యలు దేశ ఐక్యతను చెరపలేవని హితవు పలికారు. అమిత్ షా, నిర్మల సీతారామన్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ సహా పలువురు కేంద్ర మంత్రులు, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సునీల్ శెట్టి సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా క్రీడాప్రముఖులు, అలాగే ఇతర రంగాల ప్రముఖులు #IndiaTogether, #IndiaAgainstPropaganda అనే హ్యాష్ ట్యాగ్‌లను జతచేసి ఈ అంశంపై ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ