కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు హరీష్, ఇంద్రకరణ్ రెడ్డి

Gajwel, Harish Rao, Indrakaran Reddy Inaugurated Kalpaka Vanam Urban Forest Park in Gajwel, Kalpaka Vanam, Kalpaka Vanam Urban Forest Park, Mango News, Ministers Harish Rao, Siddipet, Telangana Urban Forest Parks, Urban Forest Park, Urban Forest Park in Gajwel, Urban forest park inaugurated, Urban forest park inaugurated in Siddipet, Urban Forest Parks In Telangana

గజ్వేల్ మండలం సంగాపుర్ లో 117 హెక్టార్లలో రూ.7.43 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు గురువారం నాడు ప్రారంభించారు. ముందుగా గజ్వేల్‌-వర్గల్‌ ప్రధాన రహదారిని అనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో అర్బన్‌ ఫారెస్ట్ పార్కును తీర్చిదిద్దారు. పార్కు లోపల ‘సేవ్‌ ఫారెస్ట్‌-సేవ్‌ ఎర్త్‌’ పేరిట ఏర్పాటు చేసిన భారీ గ్లోబ్‌, వాచ్ టవర్, ఒపెన్ జిమ్, చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం, గజీబొ, రాశివనం, ఒపెన్ డైనింగ్, ఇతర సౌకర్యాలతో పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో సంగాపూర్ వద్ద కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ప్రారంభించిన అనంతరం మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిలు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ “292.5 ఎకరాల భూమిలో 7.5 కోట్ల రూపాయలతో ఈ అర్బన్ పార్కును అభివృద్ధి చేశాం. తక్కువ సమయంలో రాష్ట్రంలో 4 శాతం అడవుల పునరుద్ధరణ జరిగింది. సీఎం కేసీఆర్ నిర్ణయం వల్ల క్షీణించిన అడవుల పునరుద్ధరణ జరిగిందని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి” అని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ “పట్టణాలు కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతున్నాయని ఆలోచన చేసి దేశానికే ఆదర్శంగా 36 వ అర్బన్ పార్క్ ని ప్రారంభించుకున్నాం. ఈ పరిసర ప్రాంతాల ప్రజలు వనభోజనాలను, పిల్లలతో విహార యాత్రలకు ఇక్కడికి రావాలి. మొక్కలు నాటడం మన భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయడమే. ఎంత ఆస్తిని ఇచ్చామనేది కాదు చక్కటి పర్యావరణాన్ని భవిష్యత్ తరాల వారికీ ఇవ్వాలి. ఢిల్లీలో ప్రజలు ఆరోగ్యాలను కాపాడుకోవడానికి ఆ ప్రాంతాన్ని వదిలి వేరే చోటుకి వెళుతున్నారు. భారత దేశంలో మొక్కల పెంపకానికి చట్టం తెచ్చిన తొలి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం. రేపటి భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేసి సీఎం కేసీఆర్ మొక్కల పెంపకానికి కృషి చేస్తున్నారు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్, పీసీసీఎఫ్ ఆర్.శోభ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధ శర్మ, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, సీఎఫ్ శర్వనంద్, డీఎఫ్వో శ్రీధర్ రావు, ఇతర ప్రజా ప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =