భారత్ వైమానిక దళంలోకి మరో శక్తివంతమైన అస్త్రం వచ్చి చేరింది. 5 రఫేల్ యుద్ధ విమానాలు జూలై 29, బుధవారం నాడు భారత్ చేరుకున్నాయి. ఫ్రాన్స్‌లోని బోర్డోలో నగరం నుంచి బయల్దేరిన 5 రఫేల్ యుద్ధవిమానాలు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యాయి. మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలు విడతల వారీగా భారత్ కు చేరుకోనున్నాయి. ఆగస్టులో రెండో విడతగా మరికొన్ని రఫేల్ విమానాలు రానున్నాయి. ప్రతిష్టాత్మకమైన రఫేల్ రాకతో భారత్ వైమానిక దళం మరింత బలపడనుంది. గత అక్టోబర్ లోనే దసరా, 87వ ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంలో కేంద్ర రక్షణ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్ చేరుకొని, తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని స్వీకరించి ఆయుధ పూజ నిర్వహించారు. మరోవైపు యుద్ధ విమానాలు చేరుకునే నేపథ్యంలో అంబాలా వైమానిక స్థావర చుట్టు పక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu