పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అఫ్రిది కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Former Pakistan captain Shahid Afridi, Former Pakistan Cricketer Shahid Afridi, Former Pakistan Cricketer Shahid Afridi has Tested Positive, Pakistan Cricketer Shahid Afridi has Tested Positive for the Covid-19, Shahid Afridi Coronavirus, Shahid Afridi tests positive, Shahid Afridi tests positive for Covid-19

పాకిస్తాన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తను కరోనా బారిన పడ్డ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. గురువారం నుండి ఒంటి నొప్పులతో ఇబ్బందిగా ఉన్నానని, ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు చేయించుకోగా దురదృష్టవశాత్తు కరోనా పాజిటివ్ గా తేలిందని అఫ్రిది చెప్పారు. కరోనా నుంచి త్వరగా కోలుకునేలా ప్రార్ధించండంటూ అఫ్రిది ట్విట్టర్ లో కోరారు. కాగా పాకిస్తాన్ దేశంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,32,000 దాటగా 50056 మంది కోలుకున్నారు, 2551 మంది మరణించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu