ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్ 2022 సంవత్సరానికి గానూ సాహిత్యంలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారమైన నోబెల్ బహుమతి పొందారు. ధైర్యం మరియు ఖచ్చితత్వంతో వ్యక్తిగత జ్ఞాపకశక్తి యొక్క మూలాలు మరియు సామూహిక పరిమితులను వెలికితీయడంపై ఆమె చేసిన కృషికి గానూ సాహిత్య నోబెల్ బహుమతిని అందిస్తున్నట్లుగా స్వీడిష్ అకాడమీ ప్రకటన చేసింది. అన్నీ ఎర్నాక్స్ 1940లో జన్మించింది. నార్మాండీలోని యెవెటోట్ అనే చిన్న పట్టణంలో పెరిగింది, అక్కడ ఆమె తల్లిదండ్రులకు కిరాణా దుకాణం మరియు కేఫ్ ఉన్నాయని, రచయితగా ఆమె మార్గం సుదీర్ఘమైనది మరియు కష్టమైనదని పేర్కొన్నారు. అన్నీ ఎర్నాక్స్ రచన యొక్క విముక్తి శక్తిని నమ్ముతుందని, ఆమె పనిలో రాజీపడనిదని మరియు సాదా భాషలో రచనలు ఉంటాయని తెలిపారు. ఈ పురస్కారం కింద ఆమె 10లక్షల స్వీడిష్ క్రోనర్ (911, 400 డాలర్లు) నగదును బహుమతిగా పొందనున్నారు.
ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఇచ్చే ఈ పురస్కారాలను, ప్రతీ సంవత్సరం ఆయన వర్థంతి (డిసెంబర్ 10) సందర్భంగా ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2022కు గానూ వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో పరిశోధనలు చేసిన వారికి నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. గురువారం సాహిత్య నోబెల్ బహుమతిని ప్రకటించగా, శుక్రవారం శాంతి నోబెల్ బహుమతిని, అలాగే అక్టోబర్ 10న ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY