రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, నిరోధంపై దృష్టి పెట్టాలి – ఏపీ రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై సమీక్షలో సీఎం జగన్

CM YS Jagan Held Review on Revenue Earning Departments in AP Directs Officials To Focus on Illegal Liquor, Jagan Review on Revenue Earning Departments, AP Revenue Earning Departments, AP Illegal Liquor, Mango News, Mango News Telugu, CM Jagan Reddy Reviews On Income Sources, AP CM YS Jagan Mohan Reddy, Focus On Revenue Earning Activities, Illegal Liquor in AP, CM Meets Revenue Generating Depts, AP Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, నిరోధంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు ఆయన రాష్ట్రంలో ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం జగన్ సంబంధిత అధికారులకి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి, విద్యుత్ మరియు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, కమర్షియల్ టాక్స్ కమిషనర్ గిరిజ శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక సూచనలు చేశారు.

సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు, ఆదేశాలు..

  • రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, నిరోధంపై దృష్టి పెట్టాలి.
  • బెల్టు షాపుల నిర్వహణ, నాటు సారా తయారీలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలి.
  • అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఫిర్యాదు నంబర్ ఉంచాలి.
  • పన్నుల వసూళ్ళలో లీకేజీలను అరికట్టాలి. దీనికోసం పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలి.
  • రిజిస్ట్రేషన్ ఆదాయాల పర్యవేక్షణకు సీనియర్ అధికారులు కృష్ణబాబు, రజత్ భార్గవ, గుల్జార్, నీరబ్ కుమార్ సభ్యులుగా ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు.
  • అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలి.
  • మైనింగ్ చేయడానికి అనుమతులు, లీజు లైసెన్సులు పొందినవారు ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే పని మొదలు పెట్టేలా చూడాలి.
  • ఎక్కడైనా మైనింగ్ ఆపరేషన్ ఆగిపోయినట్లైతే, సంబంధిత అధికారులు వెంటనే వారిని సంప్రదించి సమస్యలు పరిష్కరించాలి.
  • ఇక రవాణా శాఖలో ప్రభుత్వం నుంచి నగదు తీసుకొని కూడా వాహనాలను అందించని డీలర్లపై చర్యలు తీసుకోవాలి.
  • అలాగే పొరుగు రాష్ట్రాలలోని పరిస్థితులను సానుకూలంగా మలుచుకుని రవాణా శాఖకు ఆదాయం లభించేలా ప్రణాళికలు రూపొందించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =