సీఎం కేసీఆర్ ‘బీఆర్‌ఎస్‌’ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

AP Govt Advisor Sajjala Ramakrishna Reddy Interesting Comments on CM KCR's National Party BRS, AP Govt Advisor Sajjala Ramakrishna Reddy, Sajjala Ramakrishna Reddy Comments on BRS Party, BRS National Party, Mango News, Mango News Telugu, KCR National Party , TRS Party Live News And Updates, KCR New Party, BRS Party , TRS as Bharat Rashtra Samithi, TRS Name Changes To BRS, TRS Party, BRS Party Latest News And Live Updates, BRS Party Chief KCR, KCR, KTR, Kavitha Kalavakuntla

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం (జనరల్‌ బాడీ మీటింగ్)లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)ని జాతీయ పార్టీగా మారుస్తూ ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్‌ఎస్‌) పేరుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘బీఆర్‌ఎస్‌’ పార్టీపై ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం సహజమేనని, ప్రజలకు సంబంధించిన సమస్యలపై విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదేనని పేర్కొన్నారు. కొత్త పార్టీలు రావడం వలన పార్టీల మధ్య పోటీ తత్త్వం పెరిగి ఎవరికీ వారు తమ పనితీరుని మెరుగు పరుచుకునే అవకాశాలు ఉంటాయని, ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ‘బీఆర్‌ఎస్‌’ పార్టీని కూడా స్వాగతిస్తున్నామని చెప్పారు.

అయితే తాము పనికట్టుకొని కొత్త పార్టీల రాకపై ఎలాంటి విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చేయాలనుకోవడం లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే పనిగా పెట్టుకోమని, పాలనను పారదర్శకంగా నిర్వహించడానికే మొగ్గు చూపుతామని వివరించారు. ఏపీ రాష్ట్ర అభివృధే తమకు అన్నిటికన్నా ప్రధానమని, పక్క రాష్ట్రాల గురించి పట్టించుకోమని, అలాగే అనవసర వ్యాఖ్యలు కూడా చేయమని ఆయన చెప్పారు. ఇక ఇటీవల తెలంగాణ నేతలే ఏపీ అంశాలపై వ్యాఖ్యానిస్తున్నారని, దాని వలన అక్కడ వారికి ఏమైనా రాజకీయ లబ్ది కలుగుతుందేమో తమకు తెలియదని సజ్జల అన్నారు. వారు ముందుగా తమ గురించి మాట్లాడినందువల్లే, సమాధానంగా మేము మాట్లాడాల్సి వచ్చిందని, మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని, అందరూ బాగుండాలన్నదే తమ అభిమతమని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + seventeen =