హథ్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

Congress Leaders Rahul Gandhi and Priyanka Gandhi Met Hathras Incident Victim Family

హథ్రాస్‌ ఘటన బాధిత కుటుంబాన్ని ఈ రోజు కాంగ్రెస్ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పరామర్శించారు. బాధితురాలి స్వగ్రామమైన బూల్‌గదికి చేరుకుని, ఆ కుటుంబాన్ని వారు పరామర్శించారు. జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా మరో ముగ్గురిని మాత్రమే పోలీసులు అనుమతించారు. ఈ సందర్భంగా‌ రాహుల్ గాంధీ మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

ముందుగా ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని హాథ్రాస్ కు చెందిన 20 ఏళ్ల యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. యువతి మృతదేశాన్ని హాథ్రాస్‌కు తరలించి, అర్ధరాత్రి 2 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించడం, అంత్యక్రియలకు కుటుంబ సభ్యులను, బంధువులను అనుమతించలేదనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. ప్రాణాలు కోల్పోయిన యువతికి న్యాయం జరగాలంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు, నాయకులు, నెటిజన్స్ పెద్దఎత్తున స్పందిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here