డార్క్ చాక్లెట్స్ గురించి ఎవరిని అడిగినా.. చివరకు డాక్టర్లను అడిగినా కూడా ఎంచక్కా తినండి అనే చెబుతారు. అవి ఆరోగ్యానికి చాలా మంచివి.వీటిని రెగ్యులర్గా తినడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మెగ్రేన్ ఉన్నవాళ్లు, షుగర్ ఉన్నవాళ్లు కూడా రోజూ ఒక బైట్ తినొచ్చు. ఇది డిప్రషన్ నుంచి కూడా బయటపడేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఇలా రకరకాలుగా డార్క్ చాక్లెట్స్ గురించి వింటాం. డాక్టర్లే చెప్పారు కదా అని డైలీ డార్క్ చాక్లెట్ తినడం పెద్దవాళ్లు కూడా అలవాటు చేసేసుకున్నారు. అయితే ఇలాంటివారికి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.
తాజా కన్జ్యూమర్ రిపోర్ట్ ప్రకారం.. డార్క్ చాక్లెట్స్లో సీసం, కాడ్మియం అనే రెండు లోహాలు ఉన్నట్టు తేలింది. ఇవి పిల్లలలోనే కాదు..పెద్దల్లో కూడా అనేక ఆరోగ్య సమస్యలను తెస్తుందట. 28 డార్క్ చాక్లెట్ బార్లని పరీక్షించిన పరిశోధకులు.. ప్రతి దానిలో కాడ్మియం, సీసం ఉన్నట్లు కనుగొన్నారు. అన్ని రకాల బ్రాండ్లలో కూడా ఈ రెండు లోహాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే కొన్నింటిలో మాత్రం ఈ లోహాల పరిమితి కాస్త మెరుగ్గా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు.
హెర్షేస్, థియో, ట్రేడర్ జోస్ వంటి బ్రాండ్లు తమ డార్క్ చాక్లెట్ ఉత్పత్తులలో.. సీసం లేదా కాడ్మియం లేదా రెండు లోహాలను కలిపినట్లు పరిశోధకులు కనుగొన్నారు. అయితే తరచుగా సీసం తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ సమస్యలు, రోగనిరోధక వ్యవస్థ క్షీణించడం, మూత్రపిండాలు దెబ్బతినడం, రక్తపోటు, పునరుత్పత్తి సమస్యలు ఏర్పడటం వంటివి జరుగుతాయి. సీసం వల్ల కలిగే ఇతర ఇబ్బందులతో.. పిల్లలు, గర్భిణీలకి చాలా నష్టం జరుగుతుంది.
అలాగే కాడ్మియం ఎక్కువగా తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు ఎక్కువ వస్తాయి. ఇది ఊపిరితిత్తుల సమస్యలకి దారి తీస్తుంది. కిడ్నీలకు హానీ కలిగిస్తుంది. ఇది పిల్లలకు, పెద్దలకు ఇద్దరికీ ఒకే రకమైన సమస్యలను తీసుకువస్తాయి. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ కూడా.. కాడ్మియంని క్యాన్సర్ కారకంగా కూడా కనుగొంది.అయితే డార్క్ చాక్లెట్లో ఈ లోహాలు ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశమని వైద్యలు అంటున్నారు. ఇవి మెదడుపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
సీసం, కాడ్మియం అనేవి నేలలో లభించే లోహాలు. ఇవి కోకో మొక్కల మూలాల నుంచి వస్తాయి. అన్నీ నేలలు, రాళ్లలో కొంత కాడ్మియం ఉంటుంది. మైనింగ్, ఎరువులు, ఇతర పారిశ్రామిక అవసరాల కోసమే వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇవి వాతావరణంలోకి విడుదలైన తర్వాత వర్షం ద్వారా మళ్లీ భూమిలోకి చేరుతుంది.సీసం, కాడ్మియంలు చాలా సులభంగా ఊపిరితిత్తులోకి వెళ్లిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE