మోస్ట్​ సక్సెస్‌ఫుల్ ​ హీరోయిన్​

Kareena Kapoor Is The Most Successful Heroine,Kareena Kapoor,Most Successful Heroine,Successful Heroine Kareena Kapoor,Kareena Is The Most Successful,Mango News,Mango News Telugu,Indias Most Successful Actress,Kareena Kapoor, Most Successful Heroine,Karisma Kapoor, Bollywood Beauty, Katrina Kaif,Kareena Kapoor Latest News,Kareena Kapoor Latest Updates,Kareena Kapoor Live News,Heroine Kareena Kapoor News Today

హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ఏదయినా సరే హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువనే చెప్పొచ్చు. అలాగే హిట్ అయ్యే సినిమాల లిస్టు కూడా తక్కువనే చెప్పాలి. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం తన కెరీర్​లో ఎన్నో బ్లాక్​ బస్టర్​ మూవీస్​లో నటించి..బాక్సాఫీస్​‌కు రూ. 4 వేల కోట్ల వసూళ్లను అందించడంలో భాగమైంది. ఈ న్యూస్ తెలిసిన దగ్గర నుంచి ఇంతకీ ఆమె ఎవరు, ఆ సినిమాలేంటని నెట్టింట్లో తెగ వెతుకులాటలు మొదలు పెట్టేసారు నెటిజన్లు.

ఏ సినిమాకు అయినా కథ, స్కీన్ ప్లే ఎంత ముఖ్యమో.. హీరోలు అంతే ముఖ్యమని అంటారు. కానీ అందులో ఎంతమంచి రోల్ చేసినా కూడా హీరోయిన్‌ను పెద్దగా పట్టించుకోరు. కేవలం గ్లామర్ డాల్‌గానే లెక్కలేసేస్తారు. కానీ నిజం చెప్పాలంటే..సినిమాల్లో హీరోల పాత్ర ఎంత ముఖ్యమో హీరోయిన్లూ కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని చాలామంది అసలు పట్టించుకోరు.

తమ గ్లామర్​‌తో పాటు యాక్టింగ్​ స్కిల్స్‌తోనూ హీరోయిన్స్ కథ మొత్తాన్ని నడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక కొన్నిసార్లయితే హీరోలతో పోలిస్తే వీళ్లు నటించిన చిత్రాలపైనే..ఆడియన్స్ ఫోకస్​ ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా హీరోలతో పోలిస్తే హీరోయిన్స్‌కు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు. అంతెందుకు హీరోయిన్ వల్ల ఆ సినిమా హిట్ అయినా కూడా అది హీరోలకో, డైరక్టర్లకో వెళ్లిపోతుంది కానీ హీరోయిన్‌కు వెళ్లదు.

అయితే బాలీవుడ్‌ హీరోయిన్.. అభిమానులు బెబో అని ముద్దుగా పిలుచుకునే బాలీవుడ్ స్టార్​ హీరోయిన్​ కరీనా కపూర్ మాత్రం వండర్స్ క్రియేట్ చేసింది. తన కెరీర్​‌లో ఓ రికార్డు క్రియేట్ చేసి.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. బాక్సాఫీస్​ వసూళ్లలో రాణిస్తూ..బాలీవుడ్ క్వీన్ అనిపించుకుంది.

5కాదు పది కాదు ఏకంగా..23 ఏళ్లుగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న కరీనా కపూర్.. తన చిత్రాలతో బాక్సాఫీస్​ వద్ద కాసుల పంట పండిస్తోంది. సినీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటి తరం హీరోయిన్స్‌లోనే కాదు..గత జనరేషన్ హీరోయిన్స్ లో కూడా .. సుమారు 23 బ్లాక్ బస్టర్ల చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న మోస్ట్​ సక్సెస్ ఫుల్ హీరోయిన్​‌గా కరీనా టాప్​ పొజిషన్​లో ఉందట. ఆ తర్వాత కరీనా కపూర్ అక్క.. కరిష్మా కపూర్, బాలీవుడ్​ బ్యూటీ కత్రినా కైఫ్​ 22 సినిమాలతో సెకెండ్​ ప్లేస్​‌లో కొనసాగుతున్నారట. ఇక రాణి ముఖర్జీ 21, ప్రియాంక చోప్రా 18, కాజోల్ 14 సినిమాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =