యూపీఐ క్యూఆర్‌ కోడ్ స్కామ్స్‌తో బీ కేర్ ఫుల్..!

Be careful with UPI QR code scams,Be careful with UPI,QR code scams,Mango News,Mango News Telugu,UPI QR Code Scam ,UPI ,Be careful with UPI QR code scams,QR code,Password, OTP,Online Payments,Beware of QR code scam,Surge in QR code scams,QR Code Scams are Rising,QR code fraud on the rise,Beware of these UPI Payment Scam,UPI QR code scams Latest News,UPI QR code scams Latest Updates,UPI QR code scams Live News
Be careful with UPI QR code scams..!

ఇప్పుడు చిన్నపాటి ఫుట్ పాత్ షాపు పెట్టుకున్నవాళ్లూ కూడా.. ఆన్ లైన్ పేమెంట్స్‌ తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అందుకే ప్రతీ చిన్న దుకాణాలలోనూ క్యూ ఆర్ కోడ్‌ స్కానింగ్‌‌లు కనిపిస్తూనే ఉంటాయి. పది రూపాయలు ఇవ్వాలన్నా కూడా చాలామంది చిల్లర లేకపోవడంతో.. చాలామంది క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసే పేమెంట్స్ చేస్తున్నారు.

దీంతో ఇదే అదునుగా తీసుకునే క్యూ ఆర్ కోడ్ స్కామ్స్ కూడా పెరిగి.. మోసాలు జరుగుతున్నాయి. ఎలా అంటే మోసగాళ్లు తమ డూప్లికేట్ క్యూఆర్‌ కోడ్‌ను.. రిసీవర్ క్యూఆర్ కోడ్ ప్లేస్‌లో పెడతారు. దీంతో ఈ క్యూ ఆర్ కోడ్‌లను వాడి డబ్బులు పంపిన వ్యక్తులు మోసపోగా..ఈ అమౌంట్ మాత్రం స్కామర్ల అకౌంట్‌కు వెళ్తుంది.

సాధారణంగా క్యూ ఆర్ కోడ్ పేమెంట్స్‌లో, డబ్బులు పంపేవాళ్లు.. రిసీవర్ క్యూ ఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, పేమెంట్‌ అమౌంట్‌ ఎంటర్‌ చేసి, ట్రాన్సాక్షన్‌ పూర్తి చేస్తాడు. కానీ అక్కడ ఫేక్‌ క్యూ ఆర్ కోడ్‌ను షేర్‌ చేసి.. కావలసిన అమౌంట్‌ ఎంటర్‌ చేయాలని, ఓటీపీని అందించాలని నమ్మిస్తారు. చివరికి డబ్బు డెబిట్ అయిపోతుంది. మోసగాళ్ళు డబ్బుతో మాయమవుతారు.

అలాగే కొన్ని స్కామ్స్ లో.. స్కామర్‌లు క్యూ ఆర్ కోడ్‌లతో ఉన్న ఫిషింగ్ ఇ మెయిల్స్ పంపుతారు. అవి చూడటానికి బ్యాంకులు లేదా ఇ-కామర్స్ సైట్ల నుంచి వస్తున్నట్లే కనిపిస్తాయి. దీనిలో మీరు ఇంతకుముందు చేసిన పేమెంట్‌ ఫెయిల్‌ అయింది, దయచేసి మళ్లీ చెల్లించండని చెబుతూ ఫేక్ మెయిళ్లు వస్తాయి. లేదా ఈ క్యూ ఆర్ కోడ్‌ని స్కాన్ చేసి అకౌంట్‌ రీయాక్టివేట్‌ చేసుకోవాలని చెబుతారు. ఒకవేళ వీటిని నమ్మి కనుక స్కాన్‌ చేస్తే ఆర్థికంగా నష్టపోక తప్పదు.

ఆన్‌లైన్ ద్వారా జరిగే ఇలాంటి స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్,యూపీఐల పిన్‌లు తరచూ మార్చుతూ ఉండాలి. అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే..బ్యాంకుకు వెళ్లి అక్కడి అధికారులను సంప్రదించండి.

పాస్ వర్డ్,ఓటీపీ వంటి సమాచారాన్ని ఎవరికీ షేర్‌ చేయకూడదు. అలాగే ఫోన్ లేదా ఇ మెయిల్‌ ద్వారా బయటవాళ్లు అందించే వివరాల గురించి జాగ్రత్తగా ఉండండి. ఏ బ్యాంకులు కూడా ఓటీపీని కోరవన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి స్కామర్‌లు గిఫ్ట్ కార్డ్ లేదా హాలిడే ప్యాకేజీ స్కామ్‌లు వంటి అట్రాక్ట్ చేసేవాటితో మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది.

పబ్లిక్ ప్లేసెస్‌లో ఉన్న క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్ చేయకుండా, సాధ్యమయినంత వరకూ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడమే మంచిది. ఇలాంటప్పుడు మీ పిన్‌ను స్కామర్లు గుర్తించి మోసాలకు పాల్పడవచ్చు.అలాగే యూపీఐ ద్వారా డబ్బు పంపుతున్నప్పుడు ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలి. రిసీవర్ పేరును వెరిఫై చేయాలి. ఇతరులకు ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్‌ ఇస్తున్నప్పుడు వాళ్లు ఏం చూస్తున్నారో.. ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + seven =