హోమ్ లోన్.. తొందరగా తీర్చేద్దాం

Do This To Avoid The Burden Of Home Loan,Do This To Avoid The Burden,Avoid The Burden Of Home Loan,Burden Of Home Loan,Mango News,Mango News Telugu,Home Loan, Settle It Quickly Home Loan, Avoid The Burden Of Home Loan, Home Loan Burden,Banks, Canara, SBI, HDFC,Essential Tips To Reduce Home Loan,Smart Ways To Reduce Your Home Loan,Tips To Reduce Your Home Loan,Home Loan Latest News,Home Loan Latest Updates,Home Loan Live News

సొంతింటి కలను నిజం చేసుకోవడానికి చాలామందికి హోమ్ లోన్ అవసరం పడుతుంది. కానీ, నిజంగా చెప్పాలంటే ఒక దీర్ఘకాలిక భారంగానే భావించాలని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. తక్కువ వడ్డీ ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది ఉండదు కానీ, 8 శాతానికి మించి వడ్డీ రేట్లు ఉన్న ప్రస్తుత సమయంలో వడ్డీ బరువు కొన్నేళ్లపాటు మోయడం అంటే పెద్ద బరువే అంటున్నారు.

చాలామంది పదవీ విరమణ చేసిన తర్వాత కూడా.. గృహరుణానికి వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితిలో ఉంటున్నారు. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ఇంటి రుణాన్ని వేగంగా తీర్చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

హోమ్ లోన్ తీసుకున్న బ్యాంకు దగ్గరకు ముందుగా ఒకసారి వెళ్లి… మీరు తీసుకున్న రుణం,ఎంత వడ్డీ పడుతోంది.. ఇంకా ఎన్నాళ్లు చెల్లించాలనే వివరాలు తెలుసుకోవాలి. తర్వాత ఏ ఏ బ్యాంకులు, ఏ గృహరుణ సంస్థలు.. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా మొబైల్‌ యాప్‌లోనే రుణానికి సంబంధించిన ఏఏ వివరాలిచ్చాయో చెక్ చేసుకోవాలి. అప్పుడే మీరు తీసుకున్న లోన్‌పై ఒక స్పష్టత వచ్చి ఏ చేయాలో ఒక నిర్ణయానికి రావడం సులభం అవుతుంది.

నిజానికి ఇలాంటి లాంగ్ టర్మ్ రుణాలను తీసుకున్నప్పుడు చాలా ఆర్థిక లక్ష్యాలు వెనక్కి వెళ్లిపోతాయి. వీటిని సాధించడానికి రాజీ పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకే ఇలాంటి లాంగ్ టర్మ్ రుణాలను తొందరగా తీర్చే ప్రయత్నం చేయాలి. మీ లోన్‌ను వేగంగా చెల్లించాలంటే ఆర్థిక పరిస్థితి కూడా దానికి సహకరించాలి. ఆదాయం, ఖర్చులు, బాధ్యతలు, పెట్టుబడులు, ఈఎంఐలు పోను మిగులు మొత్తం కనిపిస్తే.. దాన్ని లోన్ తీర్చడానికి వినియోగించవచ్చు.

దీనికోసం వృథా ఖర్చులను సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవాలి. అప్పుడే మిగిలే మొత్తం పెరుగుతుందన్న సంగతిని గుర్తించాలి. ఇలా ఈ డబ్బులతో ఏడాదికోసారి రుణం అసలును చెల్లించే ప్రయత్నం చేయాలి. సంవత్సరానికి 12 నెలలు వాయిదాలు చెల్లించాలి కాబట్టి ఏడాది 14 నెలలు అనుకుని ఆ డబ్బులను పక్కన పెడితే వడ్డీ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు..లోన్ భారం త్వరగా తగ్గుతుంది. బాకీ ఉన్న లోన్ మొత్తంలో సంవత్సరానికి 5-7 శాతం చెల్లిస్తే లోన్ చెల్లించే టైమ్‌ మెల్లగా తగ్గుతుంది. ఏడాదికి రెండు ఈఎంఐలు అదనంగా చెల్లించినా కూడా మూడేళ్ల ముందే అప్పు తీరుతుంది.

అలాగే ఇప్పుడు లోన్ తీసుకున్న బ్యాంకులో వసూలు చేస్తున్న వడ్డీ.. మిగతా బ్యాంకుల్లో ఉన్న వడ్డీని పోల్చి చూడాలి. 0.5 శాతం వరకూ తేడా ఉంటే ఏమీ ఇబ్బంది లేదు. కానీ, 1 శాతం వరకూ ఎక్కువగా ఉందంటే వెంటనే ఆ బ్యాంకు నుంచి తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుకు మారిపోవాలి. మీ సిబిల్ స్కోరు, ఆదాయం వంటి విషయాలను బట్టి, రీఫైనాన్సింగ్‌ చేసే విషయాలను బ్యాంకులు పరిశీలిస్తాయి.

ఒకవేళ మీకు ఎక్కువ లోన్స్ ఉంటే వాటిని తీర్చి.. ఒకటే పెద్ద లోన్‌ను ఉంచుకోవడం బెటర్. కొంతమంది ఎక్కువ వడ్డీకి హోమ్ లోన్ తీసుకొని, తమ వద్ద ఉన్న డబ్బును తక్కువ వడ్డీ వచ్చే బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తారు. కానీ ఇది మంచిది కాదు. ఎమర్జెన్సీ కోసం కొంత డబ్బును పక్కన పెట్టుకుని మిగిలిన డబ్బును హోమ్ లోన్‌ను తిరిగి చెల్లించడానికి వాడుకుంటే మనకు డబ్బుల ఆదాతో పాటు హోమ్ లోన్ నుంచి త్వరగా బయటపడొచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − seventeen =