N-95 వాల్వ్ మాస్క్‌ల వినియోగంపై కేంద్రం హెచ్చరిక

Centre warns against use of N-95 masks, Govt warns against use of N-95 masks, Indian Government, Indian Government Warns Regarding Use Of Valved N-95 Masks, Indian Government Warns States, N-95 Masks, Valved N-95 Masks, Valved N-95 Masks Usage

ఎన్‌–95 మాస్క్‌ల వినియోగంపై కేంద్రం కీలక సూచనలు చేసింది. రెస్పిరేటరీ వాల్వ్ ‌లు కలిగి ఉన్న ఎన్‌–95 మాస్క్‌ల వలన ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. వాల్వ్ మాస్క్‌లు కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేవని చెప్పారు. వైద్యసిబ్బంది కోసం ప్రత్యేకంగా నిర్దేశించిన మాస్క్‌లను, సామాన్య ప్రజలు ఎక్కువుగా వినియోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రిన్సిపల్ సెక్రెటరీలకు రాసిన లేఖలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రాజీవ్ గార్గ్ పేర్కొన్నారు. రెస్పిరేటరీ వాల్వ్ ‌ఉన్న ఎన్‌–95 మాస్క్‌ల వాడకం కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని అన్నారు. ఇంట్లో తయారు చేసుకునే పేస్ కవర్/ మాస్క్‌లను వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలు కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయని, వాటిని ఎక్కువగా ప్రచారం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.

 

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu