ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేవారంతా ఇన్‌కమ్ ట్యాక్స్ (Income Tax) దాఖలు చేయాల్సిందే. ఉద్యోగం, ఇతర వ్యాపారాలతో ఆదాయాన్ని పొందే వారంతా ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల ఎన్నో బెనెఫిట్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ టైమ్ ఇన్‌కమ్ ఫైల్ చేయాలనుకున్నవారికి చాలా డౌట్స్ ఉంటాయి. ఎలా చేయాలి.. అసలు ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి అన్న అనుమానాలు వేధిస్తాయి. ఇలాంటి వారికి ఐటీ నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. నిజానికి ట్యాక్స్ రిటర్స్ అంటే చాలామంది ఎంతో కష్టమైన అనుకుంటారని.. కానీ చాలా ఈజీ అని అంటున్నారు.
ఒకప్పుడు నిజంగానే ట్యాక్స్ ఫైల్ చేయడం అంటే కష్టమే. కానీ ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ ఈజీగా రిటర్నులు దాఖలు చేసేందుకు చాలా మార్గాలను తీసుకువచ్చింది. కాకపోతే ఐటీఆర్ ఫైల్ చేయడానికి కాస్త అవగాహన పెంచుకుంటే చాలు. వాళ్లే స్వయంగా రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఫారం-16 (Form-26) కావాలి. ఇందులో మీ ఆదాయం, అర్హత ఉన్న మినహాయింపులు, పెట్టుబడులు వంటి వివరాలన్నీ ఉంటాయి.
జీతం, ఇంటి నుంచి ఆదాయాలు, ప్రతి నెలా తమ డబ్బుల మీద ఇంట్రస్ట్ వచ్చేవారు రూ.50లక్షలలోపు ఆదాయం ఉన్న వాళ్లందరికీ ఐటీఆర్-1 వర్తిస్తుంది. టెంపరరీ, లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ (Capital gains) ఉన్న వారు ఐటీఆర్-2 సెలక్ట్ చేసుకోవాలి. మీకు ఏ ఫారం వర్తిస్తుందనే వివరాలు ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో ఉంటాయి. కొత్తగా రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్లు ముందుగా ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాన్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇ-మెయిల్, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, చిరునామా అన్నీ ఫిల్ చేయాలి. అప్పుడే మీరు రిటర్నులు దాఖలు చేసేందుకు వీలవుతుంది.
ఫారం-16 ఫిల్ చేసేముందు గతేడాది మీ జీతానికి సంబంధించిన ఆధారాలతో పాటు ఫారం-26 కూడా దగ్గర ఉంచుకోవాలి. దీనివల్ల మీ మొత్తం ఇన్‌కమ్‌ను కరెక్టుగా లెక్కపెట్టడానికి పని చేస్తుంది. ఫారం-16.. ఉద్యోగం చేసే కంపెనీలో యాజమాన్యం అందిస్తుంది. అంటే లాస్టియర్ ఫైనాన్సియల్ ఇయర్ వరకూ మీరు సంపాదించిన ఆదాయానికి ఇది రుజువు. అంతేకాదు ఫ్యూచర్లో హౌసింగ్ లోన్‌లోనూ, ఇతర లోన్స్‌లోనే ఇది పనిచేస్తుంది. ఇందులో మీ జీతం కాకుండా ఇతర ఆదాయాలు ఉంటాయి. మీరు పెట్టుబడులు పెట్టిన సంస్థలే ఫారం-16 ను అందిస్తాయి. మీ టోటల్ ఆదాయంపై ఎంత వరకూ ట్యాక్స్ విధించారు అన్న వివరాలు కావాలంటే ఫారం-26 ఏఎస్‌లో తెలుస్తాయి.
దీనికోసం ఈ -ఫైలింగ్ వెబ్‌సైటులోకి వెళ్లి ఫారం-26 (Form-26) ఏఎస్‌ను డౌన్‌లోన్ చేసుకోవాలి. దీంతో మీ ఆదాయమెంత? వర్తించిన ట్యాక్స్ ఎంత అనే వివరాలు తెలుస్తాయి. కాకపోతే శ్లాబులను బాగా అర్ధం చేసుకోవాలి. మీ ఆదాయం.. ఏ శ్లాబులోకి వస్తుందనేది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఇండియాలో రెండు రకాల ట్యాక్స్ మెథడ్స్ ఉన్నాయి. పాత పన్ను విధానంలో అయితే.. అనుమతించిన మినహాయింపులు పొందడానికి వీలుంది. కానీ కొత్త పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులు లేకుండా ఉన్న శ్లాబును బట్టి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండిటిలో మీకు ఏది ఎంచుకుంటే బెనిఫిట్స్ ఉంటాయో అది ఎంచుకోవచ్చు.
ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో దీనికి సంబంధించిన కాలిక్యులేటర్ కూడా అందుబాటులో ఉంటుంది. మినహాయింపుల విషయంలో (In case of exceptions).. చట్టం అనుమతించిన మినహాయింపుల్లో (In the exceptions permitted by law) మెయిన్ సెక్షన్ 80సీ. ఈపీఎఫ్, వీపీఎఫ్, పీపీఎఫ్, లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఈఎల్‌ఎస్‌ఎస్, హోమ్ లోన్‌లు వంటివి ఉంటే మెన్షన్ చేయాలి. ఇవన్నీ కలిపి గరిష్ఠ పరిమితి (Maximum limit) రూ.1,50,000 మాత్రమే అని మర్చిపోవద్దు.
అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి చెల్లించిన ప్రీమియంను.. సెక్షన్ 80డీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఎన్‌పీఎస్‌కు చెల్లించిన రూ.50,000లకు.. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద ట్యాక్స్ బెనిపిట్ ఉంటుంది. అంతేకాదు వివిధ ట్రస్టులకు, దేవాలయాలకు ఇచ్చిన విరాళాలు ఉంటే.. వాటిని సెక్షన్ 80జీ కింద క్లెయిం చేసుకోవచ్చు. దీనివల్ల ట్యాక్స్ భారం తగ్గుతుంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాలి. మార్చి 31, 2023 వరకూ చేసిన పెట్టుబడులను మాత్రమే మినహాయింపుల కోసం క్లెయిం చేసేందుకు అవకాశం ఉంటుంది.
మీ ఫారం 26ఏఎస్‌లోని ఇన్ఫర్మేషన్‌తో.. మీ కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఫారం 16ని పోల్చి చూసుకోవాలి. మూలం వద్ద పన్ను మినహాయింపు (Deduction of tax at source) అంటే టీడీఎస్ ఎంత ఉంది అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా తేడాలున్నట్లు గుర్తిస్తే.. వెంటనే కంపెనీ దృష్టికి తీసుకెళ్లి సరి చేయాల్సిందిగా చెప్పాలి.
ఎక్స్‌పర్ట్స్ హెల్ప్ తీసుకుని .. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో ఈజీగా ట్యాక్స్ సబ్మిట్ చేయొచ్చు. అంతేకాదు ఈ ప్రాసెస్‌పై ఉన్న వీడియోలు చూసి.. చాట్‌బాట్‌ల హెల్ప్ కూడా తీసుకుని చేయొచ్చు. మీకు మరీ ఇబ్బందిగా అనిపించినప్పుడు ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్‌ను సంప్రదించవచ్చు. దీనికోసమే బయట చాలా ఆఫీస్‌లు కూడా ఉంటున్నాయి. కాకపోతే అందరినీ నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి.
అలాస్ట్ ఇయర్‌వి 2022-23 (అసెస్‌మెంట్ ఇయర్ 2023-24)కు సంబంధించిన రిటర్న్స్ ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ జులై 31. అందుకే ఈ లోపే రిటర్నులు సమర్పించడం మేలు. అందుకే చివరి నిమిషం వరకూ వెయిట్ చేయడం వల్ల అనవసర ఇబ్బందులే తప్ప ఏమీ బెనెఫిట్స్ ఉండవు. గడువు తీరిన తర్వాత రిటర్న్స్ ఫైల్ సమర్పించాలంటే.. ఆదాయాన్ని బట్టి రూ.1,000 నుంచి రూ.5,000 వరకూ ఫెనాల్టీ ఉంటుంది. సరైన ఫారంలు.. ఆదాయ వనరులను బట్టి సరైన రిటర్ను ఫారాన్ని ఎంచుకోవాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY