ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు సీబీఐ షాక్‌.. ఆయన నివాసం సహా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

CBI Raids 20 Locations Including Delhi Deputy Chief Minister Manish Sisodia House Over Allegedly in Liquor Policy, CBI Raids In Delhi Deputy Chief Minister Manish Sisodia House Over Allegedly in Liquor Policy, Delhi Deputy Chief Minister Manish Sisodia House, Delhi Deputy Chief Minister Manish Sisodia Allegedly in Liquor Policy, Delhi Deputy CM Manish Sisodia, Deputy CM Manish Sisodia, Manish Sisodia, CBI Raids 20 Locations, Delhi Deputy Chief Minister, Delhi Liquor Policy, CBI Raids, Delhi Liquor Policy News, Delhi Liquor Policy Latest News And Updates, Delhi Liquor Policy Live Updates, Mango News, Mango News Telugu,

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు సీబీఐ షాక్‌ ఇచ్చింది. శుక్రవారం ఉదయం ఆయన నివాసం సహా మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. అయితే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జరిగిన అవకతవకలపై విచారణకు సంబంధించి ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని మ‌నీష్ సిసోడియా తన ట్విట్టర్‌లో తెలియజేశారు. సీబీఐ అధికారులు త‌న ఇంటికి వ‌చ్చారని, ద‌ర్యాప్తు సంస్థ‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామని ఆయన వెల్ల‌డించారు. ఇంకా ఆయన ‘అధికారులు నాకు వ్యతిరేకంగా ఎలాంటి పత్రాలను స్వాధీనం చేసుకోలేకపోవచ్చు, ఇక్కడ వారికి ఎలాంటి ఆధారాలు లభించవు. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. దేశంలో మంచి చేసే వారిని ఇలా వేధింపులకు గురిచేయడం దురదుష్టకరం. విద్యా రంగంలో నేను చేస్తున్న పనిని ఎవరూ ఆపలేరు. నిజం నిలకడ మీద బయటకు వస్తుంది’ అంటూ సిసోడియా ట్విట్టర్‌లో వివరించారు.

అయితే గత కొద్ది రోజులుగా కేంద్రంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూలై 30న సిసోడియా పాలసీని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ అవుట్‌లెట్‌లను మూసివేస్తూ మద్యం అమ్మకానికి ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్స్‌లను ఇవ్వడానికి అవకాశం ఇచ్చినట్లయిందని ప్రతిపక్షాల ఆరోపణ. ఇక ప్రభుత్వ అత్యున్నత స్థాయి వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రైవేట్ మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూర్చే ఏకైక లక్ష్యంతో ఆప్ ప్రభుత్వం ఎక్సైజ్ విధానాన్ని అమలు చేసిందని, దీనిలో మనీష్ సిసోడియా ప్రమేయం ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ గత నెలలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆప్‌ డిప్యూటీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించడం రాజకీయాల్లో సంచలనంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + twenty =