చంద్రయాన్‌-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారు

The Launch Date For Chandrayaan 3 Experiment Has Been Finalized,The Launch Date For Chandrayaan 3,Chandrayaan 3 Experiment,Chandrayaan 3 Experiment Has Been Finalized,Mango News,Mango News Telugu,ISRO To Launch Chandrayaan-3,Chandrayaan-3,Chandrayaan-3 is to launch in mid-July,ISRO Completes Rocket Assembly,Isro prepares for final leg of tests,Chandrayaan 3 Experiment Latest News,Chandrayaan 3 Experiment Latest Updates,Launch Of Indias Moon Mission,ISRO Chief Reveals Launch Dates,Chandrayaan 3 Latest News,Chandrayaan 3 Latest Updates

జాబిల్లిపై అన్వేషణ కోసం.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగానికి ముహూర్తం ఖరారయిపోయింది. జులై 13న చంద్రయాన్‌-3 ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రయోగ లాంఛ్‌ విండో (Launch window) జులై 19 వరకు ఉందని తెలిపారు.

ఇప్పటికే చంద్రయాన్‌-3 (Chandrayaan-3) లాంచింగ్ డేట్‌పై (On launch date) ఈమధ్య కాలంలో చాలా వార్తలు వినిపించాయి. అయితే అప్పట్లో వాటిపై స్పందించిన On launch date.. లాంచింగ్ డేట్‌ను ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. కానీ రీసెంట్‌గా ”ఈసారి చంద్రుడి (Moon) ఉపరితలంపై సాఫ్ట్‌లాండింగ్‌లో విజయవంతమవుతామని విశ్వాసంగా ఉన్నామని మీడియాతో చెప్పారు. జులై 13-19 వరకు లాంఛ్‌ విండో అందుబాటులో ఉందని.. తొలి రోజే ప్రయోగం (experiment) చేపట్టాలని భావిస్తున్నామని తెలిపారు.

ఇప్పటివరకు అమెరికా (USA), చైనా (China), రష్యా (Russia) దేశాలు చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహకనౌకలను ల్యాండ్‌ చేయగలిగాయి. ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా అవతరించాలని ఇప్పుడు భారత్‌ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే.. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే టార్గెట్‌గా 2019లో చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టింది. అయితే చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ అవుతున్న సమయంలో అది విఫలమైంది. అయినా కూడా ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్‌ మాత్రం.. ఇంకా కక్ష్యలో విజయవంతంగానే తిరుగుతోంది.

అలాగే అంతకుముందు..2008లో చంద్రయాన్‌-1 తో ల్యాండర్‌ లేకుండా ఆర్బిటర్‌, ఇంపాక్టర్‌తో జరిపిన ప్రయత్నాన్ని విజయవంతంగా చేపట్టింది. అంతేకాదు అది విజయవతంగా జాబిల్లి ఉపరితలంపై నీటి జాడలను కూడా గుర్తించింది. అయితే, అది రెండేళ్ల పాటు పనిచేసే విధంగా రూపొందించినా.. దాదాపు ఒక్క ఇయర్‌లోనే దాంతో సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మొత్తం 312 రోజులు సేవలు అందించిన తర్వాత.. చంద్రయాన్ -1 మిషన్‌ ముగిసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ఆగస్టు 2009లో ప్రకటించారు.

ఇప్పుడు తలబెట్టమబోయేది చంద్రయాన్‌ (Chandrayaan) సిరీస్‌లో మూడో ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీ ఎం-3 (GSLV M-3) భారీ వాహకనౌక ద్వారా ఈ ఎక్స్పెరిమెంట్ చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రయోగ పనులు చివరి దశకు చేరుకున్నాయి. చంద్రుడి ఉపరితలం) (on the surface of the moonపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యేలా దీన్ని చేపట్టనున్నారు. ల్యాండర్‌-రోవర్‌ కాంబినేషన్తో దీన్ని ప్రయోగించనున్నారు. ఇప్పటికే చంద్రయాన్‌ 2లో ప్రయోగించిన ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది. అదే ఆర్బిటర్‌ను చంద్రయాన్‌-3కి వినియోగించుకోనున్నారు. అయితే ఇప్పుడు మరోసారి తాజాగా చేపడుతోన్న చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతమైతే మాత్రం.. భారత అంతరిక్ష పరిశోధనలో మరో కీలక అడుగుపడినట్లే అవుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − three =