టైటానిక్‌ షిప్‌ టూర్‌కు మళ్లీ సిద్ధమైన ఓషన్ గేట్

Ocean Gate Company Once Again Ready For The Featuring Trips to the Titanic Wreckage After Huge Crash Sub Implosion,Ocean Gate Company Once Again Ready,Ocean Gate Company For The Featuring Trips,Ocean Gate Company Trips to the Titanic Wreckage,Titanic Wreckage After Huge Crash Sub Implosion,Mango News,Mango News Telugu,Titanic Wreckage After Huge Crash Sub Implosion,Days After Titan Sub Implosion,Days After Sub Tragedy,Oceangate Advertises Trip,Ocean Gate Company,OceanGate still advertising trips,Ocean Gate Company Latest Updates,Ocean Gate Company Latest News,Ocean Gate Company Live News

ఓ విషాదం జరిగి కొద్ది రోజులు కూడా కాకముందే మళ్లీ అదే టూర్‌పై ప్రకటన వెలువడింది. 111ఏళ్ల టైటానిక్‌ శిథిలాల (111-year-old Titanic wreckage)ను చూసేందుకు జూన్ 18న ఐదుమందితో బయల్దేరిన మినీ సబ్ మెరైన్‌ టైటాన్‌ (Mini Submarine Titan) సముద్రంలో పేలిపోయిన ఘటన ఇంకా చాలామంది మరచిపోలేదు. ఈ ఘటనలో టైటాన్‌లో వెళ్లిన ఐదుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అతికష్టం మీద ఆ మినీ సబ్ మెరైన్ శిధిలాలతో పాటు, నౌకలో వెళ్లిన వారి శరీర అవశేషాలను వెలికి తీశారు. అయితే, ఈ విషాదం ఇంకా ఆ విషాద ఘటన గురించి అంతా మరచిపోక ముందే.. టైటానిక్ మాతృ సంస్థ అయిన ఓషన్ గేట్ ఎక్స్‌పెడిషన్స్ సంస్థ (Ocean Gate Expeditions Company) వెబ్‌సైట్‌లో వచ్చే ఏడాది టైటానిక్ పర్యటనకు సంబంధించిన ప్రకటన విడుదల చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.

1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి ఇంకా చెప్పాలంటే.. 15వ తేదీ తెల్లవారుజామున టైటానిక్ షిప్ (Titanic ship) అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయి వందలాది మంది ప్రాణాలను నీటిలో కలిపేసింది. అయితే సముద్రం అడుగున అప్పటి టైటానిక్ షిప్ శిథిలాలను చూపించేందుకు.. అమెరికాలోని ఓషన్ గేట్ ఎక్స్‌పెడిషన్స్ కంపెనీ ముందుకు వచ్చింది. అట్లాంటిక్‌ మహా సముద్రంలో సముద్ర ఉపరితలం నుంచి సుమారు 12వేల అడుగుల లోతులో అప్పటి టైటానిక్ షిప్ శిథిలాలు ఉండిపోయాయి. అక్కడికి చేరుకోవడానికి.. టైటాన్ మినీ సబ్ మెరైన్‌ (Mini Submarine Titan)లో సుమారు 2-3 గంటల పాటు సముద్ర అడుగుకు ప్రయాణించవలసి ఉంటుంది. మళ్లీ తిరిగి వచ్చేందుకు అంత కంటే కాస్త ఎక్కువ సమయమే పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇలాగే జూన్ 18న బయల్దేరిన మినీ సబ్ మెరైన్‌.. టైటాన్‌ సముద్రంలో పేలిపోయింది. అది జరిగి కొద్ది రోజులు కూడా కాక ముందే టైటానిక్ పర్యటనకు మరో ప్రకటన వెలువడింది.

ఓషన్ గేట్ ఎక్స్‌పెడిషన్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో.. వచ్చే ఏడాది జూన్‌లో నిర్వహించబోయే 2 పర్యటనలకు సంబంధించిన ప్రకటనలు ఉన్నాయి. టైటానిక్ శిథిలాలను చూసేందుకు కంపెనీ సెవన్ డేస్, సెవన్ నైట్స్ టూర్ ఆఫర్ చేస్తోంది. జూన్ 12 నుంచి 20 వరకు ఒకటి..జూన్ 21 నుంచి 29 వరకు రెండు టూర్లు నిర్వహించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటనలో చెప్పింది. ఈ సాహస యాత్ర చేయాలనుకొనేవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.

టైటాన్‌ సాహస యాత్ర కోసం వచ్చే ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.2.5 కోట్లు ఛార్జ్ చేస్తోన్నట్లు కంపెనీ చెబుతోంది. సుమారు 10వేల500 కేజీల బరువుండే టైటాన్ మినీ సబ్ మెరైన్‌లో కేవలం ముగ్గురు పర్యాటకులు, ఇద్దరు సిబ్బంది మాత్రమే జర్నీ చేయగలరని చెప్పింది. అయితే ఈ పర్యటనకు వెళ్లే వారు కనీసం 17 సంవత్సరాల వయస్సు పైబడి ఉండాలన్న కండిషన్ పెట్టింది. ఈ సాహస యాత్రలో వై-ఫై సౌకర్యాలు ఉంటాయని కంపెనీ వెబ్‌సైట్ చెబుతోంది. అయితే ఓషన్ గేట్ ఎక్స్‌పెడిషన్స్ ప్రకటన చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రూ.2.5 కోట్లు పెట్టి చావుకు టిక్కెట్ కొనుక్కోవాలా అని కొంతమంది అంటే.. అన్ని సార్లు అదే ట్రాజెడీ ఉంటుందని ఏముంది.. ఒకవేళ దిగ్విజయంగా ఈ ట్రిప్ ముగిస్తే వండర్ ఫుల్ మెమరీ వాళ్ల ఖాతాలో వేసుకున్నట్లే కదా అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 1 =