గూగుల్ సెర్చ్‌లో మీ పేరు కూడా కనిపించాలంటే..

How to Create your people card on Google Search ,Gmail Google,Add to me google,Google,Name in google search with small tips, your name to appear in Google search..
How to Create your people card on Google Search ,Gmail Google,Add to me google,Google,Name in google search with small tips, your name to appear in Google search..

ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్.. గూగుల్. ఎందుకంటే చిన్న చిన్న విషయాలను తెలుసుకోవడం కోసం చాలామంది గూగుల్‌నే ఆశ్రయిస్తున్నారు. వెళ్లాల్సిన ప్రాంతం గురించే కాదు, సెలబ్రెటీల వివరాలు, బుక్స్, అలవాటు, ఆరోగ్యం ఇలా దేని గురించి అనుమానం వచ్చినా, లేదా తెలుసుకోవాలని అనుకున్నా వెంటనే గూగులమ్మను అడిగేస్తున్నారు.

ఇలాంటప్పుడే చాలామందికి కేవలం సెలబ్రెటీల గురించి ఉన్నట్లే తమ గురించి కూడా ఉంటే బాగుణ్ణు అని అన్పిస్తూ ఉంటుంది.  అయితే ఈ సదుపాయం గూగుల్ ఎప్పుడో కల్పించిందట. కాకపోతే ఇది అందరికీ తెలియదు. గూగుల్‌లో మిమ్మల్ని మీరు ఎలా యాడ్ చేయొచ్చో.. సెర్చ్ లో కనిపించచ్చో  కొంతమందికి మాత్రమే తెలుసు.

గూగుల్‌లో మీ గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారో అన్ని విషయాలను గూగుల్‌లో ఎంటర్ చేయొచ్చు.  మీ పేరు, లొకేషన్, ఎడ్యుకేషన్ వంటి వివరాలతో పూర్తి  సమాచారాన్ని ఫిల్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీ గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. మీ పేరు కూడా సెలబ్రిటీల లాగే  గూగుల్‌లో కనిపిస్తుంది.

గూగుల్‌లో మీ గురించి వివరాలను యాడ్ చేయాలంటే..

ముందుగా గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయాలి. అక్కడ యాడ్ టీ మీ గూగుల్  అని సెర్చ్ చేయాలి.తర్వాత మీ జీ మెయిల్‌.. గూగుల్‌కి  లాగిన్ అ నిర్ధారించుకోండి.ఇప్పుడు మీరు స్టార్ట్ అనే ఆప్షన్ తీసుకుని మీ పేరు, లొకేషన్, ప్రొఫెషన్‌తో పాటు మీరు ఇవ్వాలనుకున్న సమాచారాన్ని మొత్తం ఎంటర్  చేయాలి.గూగుల్‌లో మీ వివరాలు యాడ్ చేయాలంటే హిందీ లేదా ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ను సెట్ చేసుకోవాలి.

మీ ఇన్ఫర్మేషన్ అంతా అంతా ఫిల్ చేసిన తర్వాత, ప్రివ్యూ సెలక్షన్ కనిపిస్తుంది.  అందులో  మీరు క్రియేట్ చేసిన పేజీ మీకు కనిపిస్తుంది.దానిలో ఏమైనా కరెక్షన్స్ చేయాలంటే చేసి  దానిని గూగుల్‌కి సబ్మిట్ చేయాలి.దీంతో మీ పేరు గూగుల్‌లో యాడ్ అవుతుంది.

మీరు క్రియేట్ చేసిన పేజీ  కనిపిస్తుంది అని గూగుల్ కూడా చెబుతుంది.  అందుకే మీరు ఇవ్వాలనుకున్న  పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటర్. దీనివల్ల మీ పేజీని వేరేవాళ్లు చూసే అవకాశాలు పెరుగుతాయి. ఇక గూగుల్ అందించే ఈ ఫీచర్ ఇండియాతో పాటు.. కెన్యా, నైజీరియా , దక్షిణాఫ్రికాలోని యూజర్స్‌కు అందుబాటులో ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE