ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో నెలకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులుపై ప్రపంచ దేశాలు వరుసగా స్పందిస్తున్నాయి. కాగా తాజాగా ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్) తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానంపై ఓటింగ్ కు భారతదేశం దూరంగా ఉంది. భారత్ సహా చైనా, యూఏఈ దేశాలు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. అమెరికా మరియు అల్బేనియా పెట్టిన ఈ తీర్మానంపై భద్రతా మండలిలో మొత్తం 11 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. కాగా భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశమైన రష్యా తీర్మానాన్ని నిరోధించేందుకు తన వీటో అధికారాన్ని ఉపయోగించింది. దీంతో తీర్మానం వీగిపోయింది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత్ శాశ్వత రాయబారి టి.ఎస్.తిరుమూర్తి మాట్లాడుతూ, ఉక్రెయిన్ లో ఇటీవలి పరిణామాలతో భారత్ తీవ్ర ఆందోళనకు చెందుతుందన్నారు. హింస మరియు శత్రుత్వాల తక్షణ విరమణ కోసం అన్ని ప్రయత్నాలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. మనుషుల ప్రాణాలను పణంగా పెట్టి ఎప్పటికి పరిష్కారం లభించదన్నారు. “ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులతో సహా భారతీయ పౌరుల యొక్క సంక్షేమం, భద్రత గురించి కూడా మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము. సమకాలీన ప్రపంచ క్రమం యునైటెడ్ నేషన్స్ చార్టర్, అంతర్జాతీయ చట్టం, రాష్ట్రాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు గౌరవం మీద నిర్మించబడింది. నిర్మాణాత్మక మార్గాన్ని కనుగొనడంలో సభ్యదేశాలన్నీ ఈ సూత్రాలను గౌరవించాలి. విభేదాలు, వివాదాలను పరిష్కరించడానికి చర్చలు ఒక్కటే సమాధానం. అయితే ఈ సమయంలో భయంకరంగా అనిపించవచ్చు. ఇరువర్గాలు దౌత్య మార్గాన్ని వదులుకోవడం విచారించదగ్గ విషయం. మనం తిరిగి ఆ మార్గానికే రావాలి. ఈ అన్ని కారణాల వల్ల, భారతదేశం ఈ తీర్మానానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది” టి.ఎస్.తిరుమూర్తి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ