త్రిపుర ముఖ్యమంత్రిగా మార్చి 8న మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం?

Manik Saha To Continue As Tripura CM Likely To Take Oath On March 8Th In Agartala,Manik Saha As Tripura CM,Manik Saha To Continue As CM,Tripura CM To Take Oath On March 8Th,Manik Saha To Take Oath In Agartala,Mango News,Mango News Telugu,Manik Saha Likely To Continue,Tripura Chief Minister Manik Saha,Manik Saha Latest News And Updates,Manik Saha Live News,Latest Indian Political News

ఇటీవల జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు గాను సీఎం పీఠం దక్కించుకునేందుకు 31 స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, బీజేపీ కూటమి 33 (బీజేపీ 32 స్థానాలు + ఐపీఎఫ్టీ 1 స్థానం) స్థానాల్లో సత్తా చాటింది. వరుసగా రెండోసారి కూడా త్రిపుర ప్రజలు బీజేపీ పాలనకే పట్టంకట్టడంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్దమవుతుంది. బీజేపీ విజయంతో త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహానే కొనసాగునున్నట్టు తెలుస్తుంది. సీఎంను మార్చే అవకాశం ఉందని ఊహాగానాల వచ్చినప్పటికీ మాణిక్ సాహాకే మరోసారి అవకాశం దక్కనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మాణిక్ సాహా మార్చి 8న త్రిపుర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బీజేపీ అధిష్టానం ఏడాది క్రితమే మాణిక్ సాహాను సీఎం చేయగా, తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుతో రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ అంశంపై బీజేపీ అధిష్ఠానం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ముందుగా మార్చి 3న మాణిక్ సాహా త్రిపుర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన రాజీనామా లేఖను గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య కు సమర్పించారు. గవర్నర్ సీఎం మాణిక్ సాహా రాజీనామాను ఆమోదించి, కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు చేసే వరకు పదవిలో కొనసాగాలని సూచించారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గానూ బీజేపీ 32, సీపీఎం 11, కాంగ్రెస్ 3, ఐపీఎఫ్టీ 1, టిప్రా మోతా పార్టీ 13 స్థానాలు దక్కించుకున్నాయి. త్రిపుర సీఎం మాణిక్ సాహా టౌన్ బొర్ధోవలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆశిష్ కుమార్ పై 1,257 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ క్రమంలోనే త్రిపురలో కొత్త బీజేపీ-ఐపీఎఫ్టీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం మార్చి 8న జరగనుంది. మార్చి 8న అగర్తలలోని స్వామి వివేకానంద మైదానంలో జరగనున్న బీజేపీ-ఐపీఎఫ్టీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ సన్నాహకాలపై సీఎం మాణిక్ సాహా ఇప్పటికే సమావేశం నిర్వహించి చర్చించారు. సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − eight =