బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court Sensational Verdict In Bilkis Bano Case, Supreme Court Sensational Verdict, Verdict In Bilkis Bano Case, Bilkis Bano Case Verdict, Bilkis Bano Case, Supreme Court, Gujarat, BJP, Latest Bilkis Bano Case News, Bilkis Bano Case News Update, Gujarat Bilkis Bano Case Updates, Supreme Court Latest News, Latest Sensational Verdict News, Mango News, Mango News Telugu
Bilkis Bano case, supreme court, Gujarat, BJP

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించి సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది దోషుల క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో దోషులుగా తేలిన 11 మందికి గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష కల్పించడంతో.. బాధితురాలు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్‌పై జస్టిస్ బివి నగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ మేరకు దోషులకు క్షమాభిక్ష కల్పించే అధికారం.. దోషుల ముందస్తు విడుదలపై కూడా ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ మహారాష్ట్రలో జరిగినందుకున.. దోషుల ముందస్తు విడుదలపై ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఆ ప్రభుత్వానికి ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు నిందితులు రెండు వారాల్లోగా లొంగిపోయి.. జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బిల్కిస్ బానో పిటిషన్ విచారణకు అర్హత ఉందని ధర్మాసనం వివరించింది.

2002లో గుజరాత్‌లో అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే దుండగులు బిల్కిస్ బానో కుటుంబంపై దాడి చేశారు. ఆ కుటుంబానికి చెందిన ఏడుగురిని అతి కిరాతంగా హత్య చేశారు. ఆ సమయంలో బిల్కిస్ బానో ఐదు నెలల గర్భిని. అయినప్పటికీ కనికరం లేకుండా దుండగులు బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది దోషులుగా తేలారు. వారికి 2008లో సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. గోవింద్ భాయ్ నాయ్, రాధేశ్యామ్ షా, జస్వంత్ భాయ్ నాయ్. శైలేష్ భట్, కేసర్‌భాయ్ వోహానియా, బిపిన్ చంద్ర జోషి, ప్రదీప్ మోర్ధియా, రాజుభాయ్ సోనీ, బకాభాయ్ వోహానియా, రమేశ్ చందనా, మితేష్ భట్‌లకు కోర్టు జీవత ఖైదు శిక్ష వేసింది.

అయితే గతేడాది ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఈ 11 మంది నిందితులకు గుజరాత్ ప్రభుత్వం క్షామాభిక్ష పెట్టింది. ఆ తర్వాత 11 మంది జైలు నుంచి విడుదలయ్యారు. దోషులకు క్షమాభిక్ష పెట్టడంతో గుజరాత్ ప్రభుత్వం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. నరేంద్ర మోడీపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఆ తర్వాత బిల్కిస్ బానో సుప్రీం గడప తొక్కింది. దీంతో బానో పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా తీర్పు వెలువరించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 3 =