దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 4,417 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,44,66,862 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 22 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,030 కు పెరిగింది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 1142, మహారాష్ట్రలో 549, కర్ణాటకలో 484, ఢిల్లీలో 702, తమిళనాడులో 463, ఒడిశాలో 179, రాజస్థాన్ లో 146, హర్యానాలో 135, ఛత్తీస్ ఘర్ లో 126 నమోదయ్యాయి. ఇక తెలంగాణలో గత 24 గంటల్లో 129, ఆంధ్రప్రదేశ్ లో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 6, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 88,77,46,764
- సెప్టెంబర్ 5న నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,67,490
- కొత్తగా నమోదైన కేసులు [సెప్టెంబర్ 5–సెప్టెంబర్ 6 (8AM-8AM)] : 4,417
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,44,66,862
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 6,032
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,38,86,496
- కరోనా రికవరీ రేటు : 98.70 శాతం
- యాక్టీవ్ కేసులు : 49,758 (0.11 శాతం)
- కొత్తగా నమోదైన మరణాలు : 22
- మొత్తం మరణాల సంఖ్య : 5,28,030
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY