టీమిండియా సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా కీలక నిర్ణయం, ఐపీఎల్‌ సహా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల‌కు గుడ్‌ బై

Suresh Raina Announces Retirement From All Formats of Cricket Including IPL Also, Suresh Raina Retirement From All Forms , Suresh Raina Announces Retirement, Suresh Raina Retirement From All Formats, Mango News, Mango New Telugu, Suresh Raina Retirement From IPL , Suresh Raina Retirement , Suresh Raina Latest News And Updates, Suresh Raina Retires From IPL, Suresh Raina Retirement, Suresh Raina Csk, Indian Cricket Team

టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్ని రకాల క్రికెట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు రైనా స్పష్టం చేశాడు. ఈ మేరకు అతను మంగళవారం ట్విట్టర్ లో.. ‘దేశం మరియు రాష్ట్రమైన యూపీకి ప్రాతినిధ్యం వహించడం ఒక సంపూర్ణ గౌరవం. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి నా రిటైర్‌మెంట్‌ను ప్రకటించాలనుకుంటున్నాను’ అని తెలిపాడు. అలాగే తన క్రికెట్ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, క్రికెట్ అభిమానులకు రైనా కృతజ్ఞతలు తెలిపాడు. కాగా సురేశ్ రైనా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున కొనసాగుతుండగా, 2022 సీజ‌న్‌లో ఆ జ‌ట్టు అత‌న్ని ఎంపిక చేయ‌లేదు. దీంతో తాజాగా అతను అన్ని రకాల ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

కాగా రైనా ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన కొద్దిసేపటికే రైనా కూడా తన రిటైర్మెంట్ నిర్ణయాన్నివెల్లడించడం విశేషం. టీమిండియాలో మంచి మిత్రులుగా పేరున్న ధోనీ, రైనాలు ఒకేరోజు క్రికెట్ కు వీడ్కోలు పలకడం అప్పట్లో అభిమానులను షాక్ కు గురి చేసింది. ఇక 33 సంవత్సరాల సురేశ్ రైనా భారత్ తరపున మొత్తం 226 వన్డేలు, 19 టెస్ట్‌లు, 78 టీ-20 మ్యాచ్‌ లు ఆడాడు. వన్డేల్లో 5,615 పరుగులు, 18 టెస్టుల్లో 768, 78 టి-20 ల్లో 1605 పరుగులు చేశాడు. వన్డేల్లో 5, టెస్టుల్లో 1, టీ-20ల్లో ఒక సెంచరీ సాధించి ఆడిన అన్ని ఇంటర్నేషనల్స్ ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన అతికొద్ది ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు రైనా.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 9 =